కటకటాల్లోకే అవినీతి పరులు..మోదీ ఘాటు విమర్శలు | Nda Fighting Against Corruption, Opposition To Save Corrupt Says Modi | Sakshi
Sakshi News home page

కటకటాల్లోకే అవినీతి పరులు.. ఎన్నికల ప్రచారంలో మోదీ ఘాటు విమర్శలు

Published Sun, Mar 31 2024 6:36 PM | Last Updated on Sun, Mar 31 2024 7:05 PM

Nda Fighting Against Corruption, Opposition To Save Corrupt Says Modi - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాబోయే ఎన్నికలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం కాదని ‘వికసిత్‌ భారత్’ కోసమని అని అన్నారు. 

►‘గత 10 ఏళ్లలో అవినీతికి వ్యతిరేకంగా మేం తీసుకున్న చర్యల్ని దేశం మొత్తం చూసింది. పేదల సొమ్మును దోచుకోకుండా మేం భరోసా ఇచ్చాం. అందుకే అవినీతిపరులు ఈ రోజు కటకటాల వెనుక ఉన్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 

►రాబోయే ఎన్నికలు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎన్డీయేకు అవినీతిపరులను కాపాడే ప్రతిపక్షానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని సూచించారు.   

► నేను అవినీతిపరులను మాత్రమే విచారించడం లేదు. నా దేశ ప్రజలను ఎవరు దోచుకున్నారో, నా ప్రజల దోచుకున్న సంపదను తిరిగి వారికి చెందేలా చూడడమే అని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.  

► బీజేపీ ఇప్పటికే మూడోసారి గెలుపు కోసం సన్నాహాలు ప్రారంభించింది. రాబోయే ఐదేళ్ల కోసం మేము రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నాము. మొదటి 100 రోజుల్లో మనం ఎలాంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై వేగంగా పని జరుగుతోంది’ అని మోదీ అన్నారు.

►గత 10 సంవత్సరాలలో, మీరు అభివృద్ధి ట్రైలర్ మాత్రమే చూశారు. అసలు అభివృద్ది ముందున్నదన్న మోదీ.. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement