
న్యూఢిల్లీ: కేరళ లేదా తమిళనాడు నుంచి బరిలోకి దిగి గెలిచే దమ్ము, ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్నాయా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతోపాటు కేరళలోని వయనాడ్‌లో పోటీచేస్తున్న రాహుల్ గాంధీపై మోదీ విమర్శల నేపథ్యంలో థరూర్ స్పందించారు. అమేథీలో ఓడిపోతాడనే రాహుల్ వయనాడ్‌లో పోటీచేస్తున్నారనే మోదీ మాటలు.. ప్రధాని స్తాయి వ్యక్తి చేయడం బాధాకరమని థరూర్ అన్నారు.
రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేస్తుండటంపై దేశానికి కాబోయే ప్రధాని ఇక్కడ నుంచి ఎంపికవుతారా అని దక్షిణాది రాష్ట్రాల్లో చర్చ జరుగుతోందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి వల్ల దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు. వీటిని మరింత బలపరిచేందుకే రాహుల్ దక్షిణాది నుంచి పోటీచేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment