
కన్నూరులో చిన్నారితో ప్రియాంక మాటామంతి
పుల్పల్లి/మనంత్‌వాడే (కేరళ): ఇంత బలహీనమైన ప్రభుత్వాన్ని, ఇంతటి బలహీనమైన ప్రధానిని గతంలో ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ బీజేపీపై మండిపడ్డారు. వయనాడ్‌లో పోటీచేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తరఫున ఆమె కేరళలో ప్రచారంచేశారు. ‘వేలాది మంది రైతులు కాళ్లకు చెప్పులు లేకుండా ఢిల్లీకి నడిచివచ్చి, తమ సమస్యలపై ఉద్యమించినప్పుడు జాతీయవాదులం అని చెప్పుకునే నాయకులు ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు. కనీసం వారి సమస్యలను వినడానికి కూడా ఈ ప్రభుత్వం ఇష్టపడలేదని మండిపడ్డారు. ప్రజలు తమ సమస్యలు వినే ప్రధానిని కోరుకుంటారని, స్వయంగా తను ఇచ్చిన హామీలను కూడా మరిచిపోయే ప్రధానిని ఎవరూ కోరుకోరని అన్నారు. ‘గత ఐదేళ్లలో ఈ ప్రభుత్వాన్ని, ప్రధానిని చూశాక చెబుతున్నాను. ఇంతటి బలహీనమైన ప్రభుత్వాన్ని, ప్రధానిని నేను ఎప్పుడూ చూడలేదు’అని ప్రజలనుద్దేశించి చెప్పారు. ‘వాళ్లు దేశభక్తి గురించి మాట్లాడతారు, పొరుగుదేశం గురించి మాట్లాడతారు కానీ.. దేశంలోని ప్రజలకోసం ఏం చేశారో మాత్రం ఎప్పుడూ చెప్పరు’ అని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment