
‘3 ఇడియట్స్’ అభిమానం
సినిమా హీరో హీరోయిన్లకు అభిమానులుండడం సహజం.
సినిమా హీరో హీరోయిన్లకు అభిమానులుండడం సహజం. కానీ చిత్రంగా ‘3 ఇడియట్స్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా హాంకాంగ్, జపాన్, చైనాల్లో అభిమానులను సంపాదించుకోవడం విశేషం. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైరస్ అనే నిక్‌నేమ్ గల ప్రొఫెసర్ పాత్రకు బొమన్ ఇరానీ ప్రాణం పోశాడు. ఇటీవల హాంకాంగ్ వెళ్లినప్పుడు ఆయన అభిమానుల ప్రశంసల్లో తడిసి ముద్దయ్యాడు. ఇదే విషయాన్ని ఆయన చిత్ర దర్శకుడు ిహ రానీకి ట్వీట్ చేశాడు.