వంద కోట్ల క్లబ్‌లో ‘సంజు’ | Ranbir Kapoor Sanju Movie Is Near To 100 Crores Club | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 2 2018 10:15 AM | Last Updated on Mon, Jul 2 2018 11:27 AM

Ranbir Kapoor Sanju Movie Is Near To 100 Crores Club - Sakshi

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సంజు అదే రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంజయ్‌ దత్‌ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో రణబీర్‌కపూర్‌ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సంజయ్‌ వ్యవహారాలకు సంబంధించి, ఎఫైర్‌ల గురించి చెబుతూ ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశారు.  

ఈ సినిమా ఓపెనింగ్‌ డే కలెక్షన్స్‌తో రికార్డు క్రియేట్‌ చేసింది. దాదాపు 34 కోట్టు రాబట్టి రణబీర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. అయితే వీకెండ్‌ కూడా పూర్తయింది. మొదటి వారాంతానికి వంద కోట్ల క్లబ్‌లో చేరిన సంజు.. రెండో వారాంతానికి రెండు వందల కోట్ల క్లబ్‌లోకి చేరతాడని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పరేష్‌ రావెల్‌, మనీషా కోయిరాలా, విక్కీ కౌశల్‌, సోనమ్‌ కపూర్‌, అనుష్క శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement