‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’ | Sanjay Dutt talks About His Movie Munna bhai | Sakshi
Sakshi News home page

‘ఆ సినిమా కోసం దేవుడిని ప్రార్థిస్తున్నా’

Jul 17 2019 2:59 PM | Updated on Jul 17 2019 4:07 PM

Sanjay Dutt talks About His Movie Munna bhai - Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ నటించబోతున్న మున్నా భాయ్‌-3 షూటింగ్‌ వాయిదా పడబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ బ్రేక్‌ పడిందని, తనకు క్లీన్‌చీట్‌ వచ్చాకే షూటింగ్‌ ప్రారంభం కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ముంబైలో ‘బాబా’ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా తన భార్య మాన్యతా దత్‌తో కలిసి వచ్చిన సంజూ మీడియాతో మాట్లాడాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్నా భాయ్‌-3 సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చేస్తున్నానని, త్వరలోనే షూటింగ్‌  ప్రారంభం కావాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. సినిమా ఎప్పుడు మొదలుకానుందని దర్శకుడు రాజు కుమార్‌ హిరానీని అడగాలని, అతను మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలడన్నాడు.  ఇక తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ...‘ఇప్పుడు నేను చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేస్తూ హీరోయిన్లతో రొమాన్స్ చేయలేను. అయితే హాలీవుడ్‌ నటులు మెల్ గిబ్సన్, డెంజెల్ వాషింగ్టన్‌ లాగా గొప్ప పాత్రలు చేయాలనుకుంటున్నా’ అని స్పష్టం చేశాడు. 1981 లో వచ్చిన రాకీ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి సంజూ భాయ్‌...  త్వరలో రణ్‌బీర్ కపూర్‌తో "షంషేరా" అలాగే అర్జున్ కపూర్‌తో "పానిపట్" సినిమాలలో కనిపించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement