Munna Bhai 3
-
‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్ చేయలేను’
ముంబై : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించబోతున్న మున్నా భాయ్-3 షూటింగ్ వాయిదా పడబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ బ్రేక్ పడిందని, తనకు క్లీన్‌చీట్ వచ్చాకే షూటింగ్ ప్రారంభం కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ముంబైలో ‘బాబా’ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా తన భార్య మాన్యతా దత్తో కలిసి వచ్చిన సంజూ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్నా భాయ్-3 సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చేస్తున్నానని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కావాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. సినిమా ఎప్పుడు మొదలుకానుందని దర్శకుడు రాజు కుమార్ హిరానీని అడగాలని, అతను మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలడన్నాడు. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ...‘ఇప్పుడు నేను చెట్ల వెంట తిరుగుతూ డాన్స్ చేస్తూ హీరోయిన్లతో రొమాన్స్ చేయలేను. అయితే హాలీవుడ్ నటులు మెల్ గిబ్సన్, డెంజెల్ వాషింగ్టన్ లాగా గొప్ప పాత్రలు చేయాలనుకుంటున్నా’ అని స్పష్టం చేశాడు. 1981 లో వచ్చిన రాకీ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టి సంజూ భాయ్... త్వరలో రణ్‌బీర్ కపూర్‌తో "షంషేరా" అలాగే అర్జున్ కపూర్‌తో "పానిపట్" సినిమాలలో కనిపించనున్నాడు. -
మున్నా భాయ్ 3కి కష్టాలు..?
ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మీద లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కాబోయే మున్నా భాయ్ 3 సినిమా మీద ఈ ఎఫెక్ట్ పడినట్లు సమాచారం. హిరానీ మీద వచ్చిన లైంగిక వేదింపుల ఆరోపణల గురించి ఓ క్లారిటీ వచ్చే వరకూ ఈ సినిమా పనులను ప్రారంభించకూడదంటూ ఫోక్స్ సంస్థ ఆదేశించినట్లు సమాచారం. హిరానీ మీద వచ్చిన ఆరోపణలు నిజమని తెలితే ఇక మున్నా భాయ్ 3ని తెరకెక్కించడం జరగదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కాక సోనమ్ కపూర్, అనిల్ కపూ్లు ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ ప్రమోషన్ కార్యక్రమాల్లోంచి హిరాణీ పేరును తొలగిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వీవీసీ పేర్కొంది. అంతేకాక ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు వీసీసీ వర్గాలు తెలిపాయి.‘సంజు’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో హిరానీ తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని హిరానీ ఫిల్మ్ మేకింగ్ పార్ట్నర్ విదూ వినోద్ చోప్రా, ఆయన భార్య అనుపమా చోప్రా, రచయిత అభిజిత్ జోషీకు మెయిల్ చేశానని సదరు మహిళ తెలిపారు. అయితే ఈ ఆరోపణలు అసత్యమని, తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే ప్రయత్నమే అని కొట్టిపారేశారు హిరానీ. -
‘మున్నాభాయ్’ మళ్లీ వస్తున్నాడు!
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ మరోసారి సీక్వెల్ బాట పట్టారు. గతంలో వచ్చిన ‘మున్నాభాయ్’, 'లగేరహో మున్నాభాయ్'లకు కొనసాగింపుగా మరో చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ సినిమాతో బిజీగా ఉన్న హిరానీ, ఆ తర్వాత తెరకెక్కించే చిత్రం మున్నాభాయ్ సిరీస్‌లో ఉండనుందని ప్రకటించారు. సంజు ప్రమోషన్లో భాగంగా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ‘మున్నాభాయ్ ఛలో అమెరికా’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు, కొన్ని కథలు కూడా పరిశీలిస్తున్నట్లు హిరానీ తెలిపారు. అయితే స్క్రిప్ట్ ఇంకా పూర్తికాలేదని ఆయన వెల్లడించారు. ఇదే విషయంపై సంజయ్ దత్ మాట్లాడుతూ.. ‘మున్నాభాయ్ మూడోపార్ట్ ఉంటుంది. కానీ అది మున్నాభాయ్ ఛలో అమెరికా కాకపోవచ్చు. ఎందుకంటే నేను అమెరికా వెళ్లేందుకు వీసాను పొందలేనంటూ చమత్కరించారు. హిరానీ తన ప్రస్తుత చిత్రం సంజు పూర్తయిన వెంటనే మున్నాభాయ్ స్ర్కిప్ట్‌ను పూర్తి చేస్తారు. అన్ని కలిసొస్తే వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం కావొచ్చ’ని సంజూ తెలిపారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఈ సిరీస్‌లోని రెండు చిత్రాలను శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ పేరుతో రీమేక్ చేశారు. తన కామెడీ టైమింగ్‌తో అందరిని అలరించారు. -
'ఆయన జైలు నుంచి రాగానే షూటింగ్ ప్రారంభిస్తాం'
ముంబై: బాలీవుడ్ మూవీ 'మున్నాబాయ్ ఎమ్‌బీబీఎస్' మూడో భాగం తీయడానికి అంతా సిద్ధంగా ఉన్నారని నటుడు అర్షద్ వార్సీ అన్నాడు. ప్రముఖ నటుడు, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జైలు నుంచి రాగానే సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తామని అర్షద్ తెలిపాడు. అర్షద్ వార్సీ మీడియాతో మాట్లాడుతూ.. 'మున్నాబాయ్ 3' కోసం కథ కూడా సిద్ధంగా ఉందని, సినిమా తీయడంలో ఎటువంటి సందేహాలు లేవన్నారు. సంజయ్ జైలు నుంచి తిరిగొచ్చి కొంచెం విశ్రాంతి తీసుకోగానే షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పాడు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'గుడ్డు రంగీలా' మూవీ ప్రమోషన్లలో వార్సీ ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు. ఆ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. 'మున్నాబాయ్ ఎమ్‌బీబీఎస్', రెండో భాగం 'లగేరహో మున్నాబాయ్' మూవీలలో అర్షద్ వార్సీ నటించారు.తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'శంకర్ దాదా ఎమ్‌బీబీఎస్', 'శంకర్ దాదా జిందాబాద్' సినిమాలలో శ్రీకాంత్ పోషించిన ఏటీఎమ్ పాత్రను హిందీ వెర్షన్లో అర్షద్ వార్సీ చేశారు. ముంబైలో 1993 పేలుళ్లు జరిగిన సమయంలో అక్రమ ఆయుధాలు కలిగిఉన్నాడని, అల్లర్లకు సంబంధం ఉందన్న కేసులలో నిందితుడైన సంజయ్ ప్రస్తుతం ముంబైలోని ఎరవాడ జైలులో ఉన్న విషయం తెలిసిందే.