Dunki X Review: డంకీ ట్విటర్‌ రివ్యూ | Dunki Movie Twitter Review In Telugu | Sakshi

Dunki X Review: ‘డంకీ’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే..?

Dec 21 2023 6:55 AM | Updated on Dec 21 2023 8:56 AM

Dunki Movie Twitter Review In Telugu - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరాణి కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘డంకీ’.  జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

పఠాన్‌, జవాన్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్ల తర్వాత షారుఖ్‌ నటించిన చిత్రం కావడంతో మొదటి నుంచే డంకీ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్‌ 21) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోస్ట్‌ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. డంకీ కథేంటి? ఎలా ఉంది? షారుఖ్‌ ఖాతాలో హ్యాట్రిక్‌ హిట్‌ పడిందా లేదా? తదితర విషయాలు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవోంటో చదివేయండి. ఇది కేలవం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. 

డంకీ చిత్రానికి ఎక్స్‌ లో మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. షారుక్‌ ఖాన్‌ ఖాతాలో మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ పడిందని కొంతమంది కామెంట్‌ చేస్తే.. యావరేజ్‌మూవీ అని.. భరించడం కష్టమని మరికొంత మంది కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఎక్స్‌లో నెగెటివ్‌ కంటే ఎక్కువగా పాజిటివ్‌ పోస్టులే కనిపిస్తున్నాయి.  కామెడీ సినిమాకు బాగా ప్లస్‌ అయినట్లు తెలుస్తోంది. రాజ్‌ కుమార్‌ హిరాణి మరోసారి తనదైన స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడని  నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 


డంకీ..ఓ మాస్టర్‌ పీస్‌. కథ చెప్పిన విధానం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ స్టన్నింగ్‌గా ఉంది. నటీనటుల పెర్ఫార్మెన్స్‌ అద్భుతంగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు సీట్లకు త్తుకునపోయి చూస్తారు’అని కామెంట్‌ చేస్తూ ఓ నెటిజన్‌ 5/5 రేటింగ్‌ ఇచ్చాడు. 

షారుఖ్‌ ఖాన్‌ మరోసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరబోతున్నాడు అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

బోరింగ్‌ మూవీ. షారుక్‌ యాక్టింగ్‌ బాగున్నా.. డైలాగ్‌ డెలివరీ భరించడం కష్టం. హిరాణీ రాజ్‌కుమార్‌ నుంచి వచ్చిన పేలవమైన చిత్రమిది. ఓటీటీలో రిలీజ్‌ అయ్యేంతవరకు ఎదురుచూడడం బెటర్‌ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

డంకీ బ్లాక్‌ బస్టర్‌ కాదు.. మెగా బ్లాక్‌ బస్టర్‌ మూవీ. షారుక్‌ పాత్ర మీ మైండ్‌ని బ్లాంక్‌ చేస్తుంది. స్టోరీ అదిరిపోయింది. తప్పకుండా చూడండి. రూ. 1000 కోట్ల మూవీ అంటూ మరో నెటిజన్‌ 5/5 రేటింగ్‌ ఇచ్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement