Ranbir Kapur
-
మనసు చెప్పిన మాట వింటాను
కెరీర్లో దూసుకెళుతున్నప్పుడు పెళ్లి చేసుకోవడం, తల్లి కావడం అనేది సరైన నిర్ణయం కాదని కథానాయికలకు కొందరు చెబుతుంటారు. ఇదే విషయం గురించి ఆలియా భట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – ‘‘నేనెప్పుడూ నా మనసు చెప్పింది వింటాను. జీవితాన్ని మనం ప్లాన్ చేయలేం. జీవితమే ΄్లాన్ చేస్తుంది. నా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను.. తల్లిని కూడా అయ్యాను. పెళ్లి చేసుకున్నంత మాత్రాన, తల్లయినంత మాత్రాన చేసే వృత్తిలో మార్పులు వస్తాయా.. ఎవరన్నారు? ఓ నటిగా నా మీద నాకు నమ్మకం ఉంది. మనం మంచి యాక్టర్ అయినప్పుడు, కష్టపడి పని చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు పని దానంతట అది మన దగ్గరకు వస్తుంది. ఒకవేళ రాలేదనుకుంటే.. ఇది మన టైమ్ కాదనుకోవాలి. అయినా నేను పని గురించి పెద్దగా ఆలోచించి, ఒత్తిడికి గురి కాను. తల్లి కావాలని నేను తీసుకున్న నిర్ణయానికి జీవితంలో ఎప్పుడూ పశ్చాత్తాపపడను. ఇంకా చెప్పాలంటే పెళ్లి, తల్లి కావడం అనేవి నా జీవితంలో నేను తీసుకున్న గొప్ప నిర్ణయాలు’’ అన్నారు. ఇక గత ఏడాది రణ్‌బీర్ కపూర్–ఆలియాల వివాహం జరిగిన విషయం తెలిసిందే. నవంబర్‌లో ఆలియా ΄పాపకు జన్మనిచ్చారు. కుమార్తెకు ‘రాహా’ అని పేరు పెట్టారు. ఈ పేరుకి అర్థం చెబుతూ – ‘‘రాహా అంటే ‘ఆధ్యాత్మిక బాట’ అని ఓ అర్థం. ఇంకా ఉపశమనం, విశ్రాంతి, సౌకర్యం, ఆనందం, స్వేచ్ఛ.. ఇలా ఒక్కో భాషల్లో ఒక్కో అర్థం ఉంది. మా జీవితాల్లోకి రాహా రావడం మా కుటుంబం మొత్తానికీ ఆనందం ఇచ్చింది. మా జీవితాలు ఇప్పుడే మొదలైనట్లుగా అనిపిస్తోంది. నాకైతే జీవితం పరిపూర్ణంగా ఉన్నట్లనిపిస్తోంది’’ అన్నారు ఆలియా. -
షాదీ స్క్వాడ్.. సెలబ్రిటీ పెళ్లిలకు ప్రత్యేకం!
ఆలియాభట్ రణ్‌బీర్ కపూర్ల పెళ్లి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సామాన్యుల ఇంట పెళ్లిలకే కనీసం నెల రోజుల ముందు నుంచి హడావుడి మొదలవుతుంది. కానీ ఆలియా రణ్‌బీర్ పెళ్లికి మూడు రోజుల ముందు వరకు కూడా బయటి ప్రపంచానికి తెలియదు. కానీ ఆర్నెళ్ల ముందుగానే పెళ్లి పనులు మొదలయ్యాయి. అవి చేపట్టింది షాదీ స్క్వాడ్ అనే వెడ్డింగ్ ప్లానర్ సంస్థ. ముంబైలో ఉన్న బాలీవుడ్, బిజినెస్ సెలబ్రిటీ పెళ్లిలు చేయడంతో ఈ సంస్థ పేరొందింది. పెళ్లంటేనే భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఒకప్పుడు పెళ్లి పనులు చూసుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు, ఇరుగుపొరుగు సాయం చేసేవాళ్లు. కానీ ఇప్పుడది వెడ్డింగ్ ప్లానర్ పేరుతో కొత్త తరహా వ్యాపారానికి కేంద్రమైంది. ఇప్పుడయితే ఏకంగా కార్పోరేట్ కల్చర్‌ను సంతరించుకుంది. పక్కా ప్లానింగ్‌తో ప్రొఫెషనల్స్‌తో పెళ్లిని డిజైన్ చేస్తున్నారు. ఇలాంటి సర్వీసెస్ అందిస్తున్న వాటిలో షాదీ స్క్వాడ్ ఒకటి. ఇండియాలో సెలబ్రిటీల పెళ్లిలంటే టక్కున గుర్తొచ్చే వెడ్డింగ్ ప్లానర్‌గా నిలిచింది. సౌరభ్ మల్హోత్రా, టీనా తివారీ, మనోజ్ మిత్రాలు సంయుక్తంగా షాదీ స్క్వాడ్‌ని స్థాపించారు. వీరిలో సౌరభ్ మల్హోత్రాకి గతంలో సినిమా నిర్మాణంలో బోలెడు అనుభవం ఉంది. సినిమా షూటింగ్‌ల సందర్భంగా సెట్లు వేయడం, నటీనటులను కోఆర్డినేట్ చేయడం వంటి పనులన్నీ దగ్గరుండి చూసుకునేవారు. దీంతో షాదీ స్క్వాడ్‌లో తెర వెనుక సౌరభ్‌ది కీలక పాత్ర. ఇక కల్యాణ వేడుకలకు సంబంధించి క్లంయిట్లతో మాట్లాడం, వారికి సంబంధించిన పనులు చక్కబెట్టడం టీనా తివారీ బాధ్యత. ఆర్థిక వ్యవహరాలు చక్కబెడుతూ.. చిన్న స్థాయి నుంచి దేశంలోనే సెలబ్రిటీల పెళ్లిలకు కేరాఫ్ అడ్రస్‌గా షాదీ స్క్వాడ్‌ను రూపుదిద్దడంలో మనోజ్ మిత్రాదే కీలక భూమిక. జీవితంలో ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా గుర్తుంచుకునే వేడుక వివాహం. ఇందులో భాగమైన వధువరులు, వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు ఎటువంటి ఒత్తిడి ఇవ్వకుండా కళ్యాణ వైభోగం ఫీలింగ్ ఇవ్వడం వెడ్డింగ్ ప్లానర్ కంపనీల ప్రధాన బాధ్యత. లాజిస్టిక్స్, ఎంటర్టైన్మెంట్స్, హాస్పిటాలిటీ, గెస్ట్మేనేజ్మెంట్, ఇన్విటేషన్లు, గిఫ్టులు, డెకరేషన్, ఫుడ్, బేవరేజెస్, డెస్టినేషన్స్, వెన్యూ మేనేజ్మెంట్, బడ్జెట్ మేనేజ్మెంట్ తదితర పనులన్నీ చూసుకుంటారు. టైమ్‌కి వచ్చి పెళ్లి వేడుకను తనివితీరా ఎంజాయ్ చేయమే మన పని. ఇటీవల వార్తల్లో నిలిచిన ఫర్హాన్ అక్తర్ - శిబాని, కత్రీనా కైఫ్ - విక్కీ కౌశల్, వరుణ్ ధావన్ - నటాషా, అనుష్కా శర్మ - విరాట్ కోహ్లీ, నిక్‌జోనాస్ - ప్రియాంక చోప్రా వంటి ప్రముఖుల వివాహ వేడుకులు షాదీ స్క్వాడ్ చేపట్టింది. ముంబై, జైపూర్, జెస్మలేర్, కొచ్చి, గోవా, రతన్బోర్, మస్కట్, ఢిల్లీ, బెంగళూరు, థాయ్‌లాండ్, మస్కట్, ఇటలీ తదితర వేదికల్లో ఈ వేడుకలు నిర్వహించింది. పెళ్లి వేడుకులను బుక్ చేసుకోవాలంటే కనీసం ఆరు నెలల ముందుగా మమ్మల్ని సంప్రదించడం మంచిదని షాదీ స్క్వాడ్ సూచిస్తోంది. అది కూడా పెళ్లి వేడుకలకు సంబంధించిన స్థలం మీరు ఎంపిక చేసుకుంటే. లేదంటే పెళ్లి థీమ్ మాత్రమే చెబితే కనీసం పది నెలల ముందుగా చెప్పాలంటోంది. ఒక్కసారి ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక... వివిధ అంశాలను బేరీజు వేసుకుని ఎప్పుడు, ఎక్కడ, ఏ థీమ్‌లో ఎంత బడ్జెట్లో వేడుకలు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. వెడ్డింగ్ ప్లానర్లలో షాదీ స్క్వాడ్‌తో పాటు వివాహ్ కంపెనీ, మోత్వాని తన్వీ అండ్ కంపెనీ, దేవికా సఖూజా, డిజైనర్ ఈవెంట్స్ , ది డోలీ డైయిరీ, అభినవ్ భగత్ ఈవెంట్స్, డ్రీమ్క్రాఫ్ట్స్, ది వెడ్డింగ్ డిజైన్ కంపెనీ వంటి సంస్థలు ఉన్నాయి. మన దగ్గర హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో కార్పోరేట్ స్థాయిలో వెడ్డింగ్ ప్లానర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. చదవండి: Ranbir Kapoor-Alia Bhatt Marriage: కాబోయే భార్యకు రణ్‌బీర్ కాస్ట్లీ గిఫ్ట్! అదేంటో తెలుసా? -
రణ్‌బీర్ అంటే అప్పటి నుంచే ఇష్టం: అలియా
బాలీవుడ్ నటి అలియా భట్, నటుడు రణ్‌బీర్ కపూర్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ముడేళ్లుగా ప్రేమలో విహరిస్తున్న ఈ కపుల్ పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో ఓ ఈవెంట్లో అలియా బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ గురించి మాట్లాడిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఈవెంట్ అలియా మాట్లాడుతూ.. ‘రణ్‌బీర్‌పై నాకు చిన్నప్పటి నుంచే క్రష్ ఉంది. అందుకే ఆయన వాల్ పోస్టర్ని నా బెడ్రూమ్లో పెట్టుకున్నా. చిన్నప్పుడు ఓ సారి రణ్‌బీర్‌ని కలిశా. ఆ సమయంలో అతని భుజంపై తల పెట్టుకొని ఓ ఫోటో తీయించుకోవాలనుకున్నా.. కానీ విపరీతమైన సిగ్గు ఉండడంతో అలా చేయలేకపోయా’ అని చెప్పింది. అంతేకాకుండా ఈ చాక్లెట్ బాయ్‌ని పెళ్లి చేసుకోవాలని కలలు కనేదని ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఈ బ్యూటీ తెలిపింది. అయితే అలియా కంటే ముందు రణ్‌బీర్, కత్రినా కైఫ్‌తో ప్రేమలో ఉండేవాడు. వారిద్దరి బ్రేకప్ అనంతరం ఈ జంట డేటింగ్ చేయడం ప్రారంభించారు. కాగా ఇటీవలే ఈ లవర్‌బాయ్ 39 బర్త్‌డే సందర్భంగా జోధ్‌పూర్‌లో ఎంజాయ్ చేసోచ్చింది ఈ కపుల్. చదవండి: ప్రేయసితో రణబీర్ బర్త్ డే పార్టీ.. ఒక్క రాత్రికి రూ.1.65 లక్షలు -
రిషీ కపూర్ అనే నేను
షో బిజ్ లో ఒకలాంటి డాబు ఉంటుంది. తప్పక కృత్రిమంగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. చాలా సందర్భాల్లో మాటలకు షుగర్ కోటింగ్ వేసి మాట్లాడాల్సి ఉంటుంది. అయితే కొందరు ఇందుకు మినహాయింపుగా ఉంటారు. రిషీ కపూర్ ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడేయడమే. నచ్చింది చెప్పేయడమే. తన బయోగ్రఫీలోనూ అదే పాటించారు. మనసుకు ఫిల్టర్ వేయకుండా మనసులో ఉన్నదంతా ఈ పుస్తకంలో చెప్పుకున్నారు. 2017లో ఈ పుస్తకం విడుదలైంది. ఆటోబయోగ్రఫీ ‘ఖుల్లమ్ ఖుల్లా: రిషి కపూర్ అన్ సెన్సార్డ్’ పుస్తకంలో రిషి కపూర్ రాసుకున్న పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం. నేను అదృష్టవంతుణ్ణి మా కుటుంబం కూడా ఆకాశం లానే. ఇంట్లో ఎంతో మంది స్టార్స్. నా జన్మ నక్షత్రం కూడా అద్భుతమైనది. నేను అదృష్టవంతుణ్ణి. పృథ్వీ రాజ్ కపూర్ కి మనవడిని అయినందుకు, రాజ్ కపూర్ లాంటి తండ్రికి కొడుకు అయినందుకు, నీతూ లాంటి భార్య ఉన్నందుకు, రిద్ధిమా, రణ్ బీర్ లాంటి పిల్లలు పుట్టినందుకు నేను అదృష్టవంతుడిని. నేనెప్పుడూ అదృష్టవంతుడినే. నా బాల్యం నా బాల్యం అంతా సినిమాలతోను, సినిమాల చుట్టూను తిరిగింది. సినిమా కథలు వింటూనే పెరిగాను. కపూర్ ఫ్యామిలీ మొత్తంలో అతి చిన్న వయసులో కెమెరా ముందుకు వచ్చింది నేనే. నాన్నగారు నటించిన ‘శ్రీ 420’ సినిమాలోని ‘ప్యార్ హువా...’ పాటలో వచ్చే ముగ్గురు పిల్లల్లో చిన్నవాణ్ణి నేను. మిగతా ఇద్దరు రణ్ ధీర్ కపూర్, రీతూ కపూర్. ఆ పాట మొత్తం వర్షంలో సాగుతుంటుంది. వర్షపు నీరు నా కంట్లో పడటంతో ఏడ్చేవాణ్ణి. ‘మీ నాన్న గారు చెప్పింది చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా’ అని నాతో ఆ సన్నివేశం పూర్తి చేయించారు ఆ సినిమా హీరోయిన్ నర్గీస్ జీ. ఆదివారం మాత్రమే ఆ సినిమా చేశా నాన్నగారు ప్లాన్ చేసిన ‘మేరా నామ్ జోకర్’ సినిమాలో హీరో చిన్నప్పటి పాత్ర నాతో చేయించాలనుకున్నారు. అయితే మా అమ్మ మాత్రం కొన్ని షరతులతో నన్ను సినిమాలో యాక్ట్ చేయించడానికి ఒప్పుకున్నారు. అవేంటి అంటే.. నా చదువుకి ఇబ్బంది కలగకూడదు, స్కూల్లో నా అటెండెన్స్ తగ్గకూడదు. ‘షూటింగ్ మొత్తం ఆదివారం చేస్తా’ అన్నారు నాన్న. వాళ్ల సంభాషణ చాలా క్యాజువల్ గా సాగింది. కానీ నాకు మాత్రం చెప్పలేనంత సంతోషం కలిగింది. స్క్రిప్ట్ తీసుకొని నా రూమ్ లోకి వెళ్లి డైలాగ్స్ ప్రాక్టీస్ చేశా. ఆ తర్వాత సంతకం ఎలా పెట్టాలో నేర్చుకున్నా. సూపర్ స్టార్ అయ్యాక ఆటోగ్రాఫ్ ఇవ్వాలి కదా. కందిన చెంపతో ఏడ్చాను ‘మేరా నామ్ జోకర్’లో ఓ సన్నివేశంలో నా తల్లి పాత్ర చేసిన ఆమె నా చెంప చెళ్లుమనిపించాలి. ఆ సీన్ సరిగ్గా రావడానికి 9 టేకులయింది. దెబ్బకు నా చెంప ఎర్రగా కందిపోయింది. ఏడుస్తూ కూర్చున్నాను.. మా నాన్న తన పనిలో నిమగ్నమైపోయారు. అప్పుడు అర్థమయింది.. సెట్లోకి అడుగుపెట్టేంతవరకే ఆయన నా తండ్రి అని అడుగు పెట్టాక ఫిలిం మేకర్ అని. పాకెట్ మనీ ట్రిక్ రాజ్ కపూర్ పిల్లలంటే అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ముంబయి లోని ఓ పాపులర్ హోటల్ కి నాన్నగారు తరచూ వెళ్లే వారు. నేను ఆ హోటల్ కి వెళ్తే బిల్ ఆయన అకౌంట్ లో చెల్లించడం అలవాటు. మా ఫ్రెండ్స్ ని తీసుకెళ్లినా బిల్ ఆయన ఖాతాయే. కానీ మా ఫ్రెండ్స్ మధ్య రూల్ ఏంటంటే.. ఎప్పుడూ బిల్ షేర్ చేసుకోవాలి. వాళ్ల వాటా డబ్బులు నేను తీసుకొని బిల్ మొత్తం నాన్న అకౌంట్ లో కట్టేసేవాడిని. ఫ్రెండ్స్ వాటా డబ్బులు పాకెట్ మనీలా నా జేబులో వేసుకునేవాణ్ణి. నీతూని నిందించాను 1980లో నీతు, నా పెళ్లి జరిగిన తర్వాత నా సినిమాలు ‘కర్జ్, జమానా కో దికానా హే’ దారుణంగా విఫలమయ్యాయి. పెళ్లి అవడంతో నా రొమాంటిక్ హీరో ట్యాగ్ పోయిందనుకున్నాను. దానికి కారణం నీతూనే అని తనని నిందించాను. డిప్రెషన్లోకి వెళ్లా. కెమెరాకు, పబ్లిక్‌కి మొహం చూపించే ధైర్యం లేకుండా పోయింది. అప్పుడు నీతు కడుపుతో ఉంది. నా డిప్రెషన్ ని ఎలా తట్టుకుందో అని ఆశ్చర్యంగా ఉంటుంది. నాతో ఇన్నాళ్లు కలసి ఉన్నందుకు నీతూకి అవార్డు ఇవ్వాలి అని మా అమ్మ, అక్క అంటుంటారు. అది నిజమే. నా తీరుని మార్చాలని తను ఎప్పుడూ ప్రయత్నించలేదు. నా చిరాకుని తట్టుకుంది. నా మూడ్ కి తగ్గట్టు తను ఉండేది. ఎంతో సహనం వహించింది. నేను, నీతు గొడవపడేవాళ్లం (అందులో చాలాసార్లు తప్పు నాదే అయ్యుంటుంది). కొన్నిసార్లు 6 నెలల వరకు మాట్లాడుకోకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా సమస్యలను కలిసే పరిష్కరించుకున్నాం. నాలో పురుషాహంకారి ఉన్నాడు పెళ్లికి ముందు మా ఇద్దరిలో ఒకరు సంపాదిస్తూ, మరొకరు పిల్లలను చూసుకోవాలనుకున్నాం. నీతు యాక్టింగ్ మానేస్తా అన్నప్పుడు మాట వరసకు కూడా నేను వద్దనలేదు. ‘తన భార్య పని చేయకూడదని నాలో ఉన్నపురుషాహంకారి అలా చేశాడేమో?’. కానీ ఇప్పుడు నా ఆలోచనా విధానం (పుస్తకం రాస్తున్నసమయానికి) చాలా మారింది. అవార్డు కొన్నందుకు సిగ్గుపడుతున్నా అప్పుడు నాకు 20 ఏళ్లు ఉంటాయంతే. నా ‘బాబీ’ విడుదలైన సంవత్సరం (1973)లోనే అమితాబ్ బచ్చ¯Œ ‘జంజీర్’ కూడా విడుదలైంది. ‘బాబీ’ సినిమాకి నాకు బెస్ట్ అవార్డు వచ్చినందుకు అమితాబ్ బాధపడతాడని అనుకున్నాను. ఎందుకంటే ‘జంజీర్’ కోసం తనకి అవార్డు రావాలనుకుని ఉంటాడేమో. అయితే నేను అవార్డు కొనుక్కున్నానని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. నిజానికి అవార్డు కొని, మ్యానిపులేట్ చేయాలనుకునే వ్యక్తిని కాదు నేను. అయితే దేని గురించీ ఆలోచించని వయసులో ఉన్నాను. అవార్డు ప్రతినిధి ‘30వేలు ఇవ్వండి. అవార్డు మీది అవుతుంది’ అనడంతో, వెనకా ముందూ ఆలోచించకుండా ఇచ్చేశా. అలా అవార్డు దక్కించుకున్నందుకు ఎప్పటికీ గిల్టీగా ఉంటుంది. నా ప్రాధాన్యత ఎప్పుడూ రిషీయే ‘‘ఎప్పుడైనా రిషి నుంచి విడిపోవాలనే ఆలోచన వచ్చిందా?’’ అని నన్ను అడిగితే ‘‘చాలాసార్లు. ప్రతిరోజూ’’ అని సమాధానం చెబుతాను నేను సరదాగా. ఎందుకంటే.. ఇతనితో తప్ప నేను వేరే ఎవ్వరితోను ఉండలేనేమో? ఎందుకంటే... తెలుసుకున్న కొద్దీ గొప్పగా కనిపించే వ్యక్తి రిషి. ఎందుకంటే.. ఏళ్లు గడుస్తున్న కొద్దీ అతని గొప్ప లక్షణాల ముందు అతని చెడ్డ అలవాట్లు కనిపించనంత చిన్నగా మారిపోతున్నాయి. నా జీవితంలో జరిగిన గొప్ప విషయం ఏంటంటే.. రిషీని పెళ్లి చేసుకోవడం. రిషి చాలా కష్టమైన మనిషి. అది ఆయన్ను అర్థం చేసుకునేంత వరకే. కొత్తవాళ్లను సులభంగా నమ్మడు. అందుకే అతని చుట్టూ ఎప్పుడూ పాత ముఖాలే. 15 ఏళ్ల క్రితంతో పోలిస్తే, ఇవాళ్టికి (పుస్తకం రాస్తున్న సమయానికి) నేను , రిషి ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధానం చాలా మారింది. ఆయన ముఖంలో చిన్న మార్పు చూసి ఆయన మనసును అర్థం చేసుకోగలను. నేను పెట్టుకున్న ఫస్ట్ రూల్ ఏంటి అంటే రిషీయే నాకు ఎక్కువ. అతనితో పోలిస్తే ఎవ్వరూ ఎక్కువ కాదు. బాబ్ (రిషీని నీతూ అలానే పిలుస్తారు)కి సినిమాలంటే పిచ్చి. కుటుంబం అంటే పిచ్చి. నా కుటుంబమే నాకు ప్రపంచం. అందుకే సినిమాలా? కుటుంబమా? అని ప్రశ్న ఎదురైనప్పుడు ఇష్టంగా ఇంట్లోనే ఉండాలనుకున్నా. నాన్నతో మరింత టైమ్ గడిపి ఉండాల్సింది (తండ్రి ఆటోబయోగ్రఫీ ముందు మాటలో రణ్ బీర్ పేర్కొన్న విషయాలివి) నాకు మా నాన్నతో కంటే అమ్మతో దగ్గరితనం ఎక్కువ. నాన్నతో చాలా గౌరవమైన బంధమే ఉండేది. కానీ కొన్నిసార్లు నాన్నతో ఇంకొంచెం ఫ్రెండ్లీగా ఉండాల్సింది అనిపించేది. ఇంకొంచెం టైమ్ స్పెండ్ చేసి ఉండాల్సిందనే ఫీలింగ్ కూడా ఉంది. ఏదో ఒక సాయంత్రం ఫోన్ చేసి ‘నాన్నా.. ఎలా ఉన్నావు’ అని అడిగి ఉండాల్సింది అనిపిస్తుంటుంది. మా పిల్లలతో నేను ఇలా ఉండను.. కచ్చితంగా వారికి సమయం కేటాయిస్తాను. ఫ్రెండ్లీగా ఉంటాను. ఇలా అంటున్నప్పటికీ మా నాన్న అంటే నాకు చాలా గౌరవం, ఇష్టం. ‘మన ఫ్యామిలీని బలంగా కలిపి ఉంచినది, మన అందరి జీవితాలను సులభం చేస్తున్నది మీ అమ్మ (నీతూ కపూర్) మాత్రమే’ అని చాలా స్పష్టంగా చెప్పేవారు నాన్న. వాళ్ల ఇద్దరి నుంచే ప్రేమ అంటే ఏంటి? మనుషుల ప్రవర్తన ఎలా ఉండాలి? అనే విషయాలు నేర్చుకున్నాను. చేసే పనిని ఎలా ప్రేమించాలో నేర్పించారు. నేను యాక్టర్ అయిన కొత్తల్లో నాన్న నాకంటే ఉత్సాహంగా షూటింగ్స్ కి వెళ్లడం చూశాను. నా మీద ఆయనకు ఉన్న గౌరవం చూస్తే భయంగా ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాను. -
పరిశోధకుడు
వారణాసిలో పురాతత్వ శాస్త్రవేత్తగా నాగార్జున పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ఫలితాలు వచ్చే ఏడాది వెండితెరపై విడుదలవుతాయి. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా, మౌనీరాయ్ కీలక పాత్రధారులు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఒక శక్తిమంతమైన ఆయుధం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుంది. చేతుల నుంచి నిప్పును రప్పించే శివ పాత్రలో రణ్‌బీర్, ఇషా పాత్రలో ఆలియా కనిపిస్తారు. శివ పాత్రకు గురువుగా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. పురాతత్వ శాస్త్రవేత్తగా నాగార్జున నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఏడాది జూన్‌లో నాగార్జునపై వారణాసిలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మనాలిలో జరుగుతోంది. అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మూడు విభాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి విభాగం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. -
‘నాకు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది’
గత ఎనిమిది నెలలుగా క్యాన్సర్‌తో చేస్తున్న పోరాటం ముగిసిందని... ప్రస్తుతం తనకు క్యాన్సర్ నయమైందని అంటున్నారు బాలీవుడ్ నటుడు రిషి కపూర్. డెక్కన్ క్రానికల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘గత ఎనిమిది నెలలుగా క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నాను. అమెరికాలో ఈ నెల 1 నుంచి మరో చికిత్స ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దేవుడు నా మీద దయ చూపాడు. ఇక నాకు ఏ చికిత్స అవసరం లేదన్నారు వైద్యులు. అంటే ఇప్పుడు నాకు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. బోన్ మ్యారో చికిత్స ఒక్కటి మిగిలి ఉన్నది. దానికి మరో 2 నెలల పడుతుందన్నారు వైద్యులు. అది పూర్తయ్యాక ముంబయికి తిరిగి వస్తాను’ అని రిషి కపూర్ తెలిపారు. అంతేకాక ‘నేను ఇంత త్వరగా కోలుకున్నానంటే అందుకు కారణం నా కుటుంబం, నా అభిమానులు ప్రేమ, దేవుడి దయ. ముఖ్యంగా నా భార్య నీతు. తను లేకపోతే నేను న్యూయార్క్ వెళ్లి చికిత్స చేయించుకునేవాడిని కాను. నా పిల్లలు రణ్‌బీర్, రిధిమా కూడా నాకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా నా గురించి ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. సాధరణంగా నాకు ఓపిక చాలా తక్కువ. అలాంటిది ఓపిగ్గా ఎలా ఉండాలో నాకు దేవుడు ఈ రకంగా తెలియజేశాడు’ అని పేర్కొన్నారు. ఎనిమిది నెలల క్రితం వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళుతున్నానని ట్విట్ చేశారు రిషి కపూర్. త్వరలోనే ముంబయికి తిరిగివస్తానని, అంతవరకు తన అనారోగ్యం గురించి ఎలాంటి పుకార్లు ప్రచారం చేయవద్దని కోరారు. అయితే తనకు వచ్చిన అనారోగ్య సమస్యను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం చికిత్స దాదాపు పూర్తికావొస్తున్న నేపథ్యంలో తనకు క్యాన్సర్ వ్యాధి వచ్చిందని తాజాగా మీడియా ద్వారా బయటపెట్టారు. అయితే ఇప్పుడు తాను కోలుకున్నానని వెల్లడించారు రిషి కపూర్. చివరిగా ‘ముల్క్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రిషి కపూర్. -
జోడీ రిటర్న్ ్స
బాలీవుడ్ ఆన్‌స్క్రీన్ సూపర్‌హిట్ జోడీల్లో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకోన్ జంట ఒకటి. వీళ్లిద్దరూ కలిసి ‘హే జవానీ హై దివానీ, తమాషా’ సినిమాల్లో నటించారు. లేటెస్ట్గా మరోసారి స్క్రీన్‌పై కనిపించడానికి రెడీ అయ్యారని తెలిసింది. అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ సినిమా రూపొందనుందట. అందులో రణ్‌బీర్, దీపికాను లీడ్ పెయిర్‌గా ఎంపిక చేసుకున్నారట చిత్రబృందం. ఈ సినిమానే కాకుండా లవ్ రంజన్ దర్శకత్వంలో రూపొందే సినిమాలోనూ రణ్‌బీర్, దీపికా జోడీగా నటిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఒక్కటి కన్ఫర్మ్ అయినా మళ్లీ ఈ జంటను స్క్రీన్‌పై చూడొచ్చు. రణ్‌బీర్ ప్రస్తుతం చేస్తున్న ఫ్యాంటసీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ 2019 క్రిస్మస్ సీజన్లో రిలీజ్ కావాలి. ప్రస్తుతం 2020 సమ్మర్లో రిలీజ్ కానుందని ప్రకటించారు. -
విడిపోవడం మంచికే!
ఈ ఏడాది బాలీవుడ్లో పెళ్లి బాజా బాగా మోగింది. అనుష్కాశర్మ–విరాట్ కోహ్లీ, నేహాధూపియా–అంగద్ బేడీ, సోనమ్ కపూర్–ఆనంద్ అహూజా, దీపికా పదుకోన్–రణ్వీర్ సింగ్ తాజాగా ప్రియాంకా చోప్రా–నిక్ జోనస్ ఈ సంవత్సరం ఏడడుగులు వేశారు. మరికొన్ని జంటలు పెళ్లికి రెడీ అవుతున్నాయి. తోటి కథానాయికలందరూ పెళ్లిచేసుకుని ఒక ఇంటివారు అవుతున్నారు. మీ పెళ్లి ఎప్పుడు? అని కత్రినా కైఫ్‌ని అడిగితే.. ‘‘పెళ్లి గురించిన ఆలోచన ఉంది. కానీ ఎందుకో వర్కౌట్ కావడం లేదు. నీ లైఫ్‌లో నువ్వు నిర్మించుకున్న దారిలో వెళ్లాల్సిందే. అందుకే పెళ్లి గురించి పెద్దగా ఒత్తిడికి లోనవ్వాలని అనుకోవడం లేదు. కొన్ని విషయాలు నేను అనుకున్నట్లు జరగలేదు. సమయం కలిసొచ్చినప్పుడు పెళ్లి కబురు చెబుతా’’ అని పేర్కొన్నారు. ఇక రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతూ– ‘‘అతన్నుంచి విడిపోవడం నా మంచికే జరిగింది’’ అన్నారు. -
కొత్త అవతారం
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో చూస్తారని అంటున్నారు దర్శకుడు కరణ్ మల్హోత్రా. రణ్‌బీర్ కపూర్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘షంషేర్’. వాణీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్‌దత్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం ముంబైలో జరిగింది. ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి ప్రారంభం అవుతుంది. ‘‘మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. రణ్‌బీర్‌కపూర్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో చూస్తారు. వచ్చే ఏడాది జూలై కల్లా సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు కరణ్ మల్హోత్రా. ఈ సినిమా కాకుండా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నారు రణ్‌బీర్. ఈ చిత్రం తొలిపార్ట్ వచ్చే ఏడాది క్రిస్మస్కు విడుదల కానుంది. -
ప్రేమతో కేక్
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్లో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ వాళ్లు మాత్రం ఒప్పుకోవడం లేదు. అయితే వీలు చిక్కినప్పుడల్లా కాస్త దగ్గరగానే సమయాన్ని గడుపుతున్నారు. శుక్రవారం రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు. ఈ ఏడాదితో 36వ వసంతంలోకి అడుగుపెట్టారాయన. బర్త్‌డే సందర్భంగా ఆలియా భట్ ఇంటికి వెళ్లి లంచ్ కూడా చేశారు రణ్‌బీర్. బర్త్‌డే బాయ్ కోసం స్పెషల్‌గా ఏదైనా చేయాలనుకున్న ఆలియా భట్ స్వయంగా కేక్ తయారు చేశారు. ఈ కేక్ తయారీ కోసం చెఫ్ హర్ష ఆమెకు సహాయం చేశారు. అన్నట్లు.. ఈ కేక్‌ను తయారు చేయడంలో ఆలియాకు హర్ష ఇచ్చిన సలహా ఏంటో తెలుసా...‘‘కేక్‌ను బేక్ చేయాలంటే కావాల్సిన ముఖ్యమైన పదార్థం ముఖంపై నవ్వు. ఒకవేళ నవ్వు రాకపోతే పేస్ట్రీ క్రీమ్‌ను కాస్త నాకు’’ అని సలహా ఇచ్చారట సరదాగా. కేక్ రెడీ చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు హర్ష. హ్యాపీ బర్త్‌డే ‘సన్‌షైన్’ అంటూ రణ్‌బీర్ నవ్వుతున్న ఫొటోను షేర్ చేశారు ఆలియా. ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో రణ్‌బీర్, ఆలియా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ప్రేమలో పడింది ఈ సెట్లోనే అని టాక్. సో.. స్క్రీన్‌పై రొమాంటిక్ సీన్స్‌లో కెమిస్ట్రీ బాగుంటుందన్నమాట. -
బ్లాక్‌బస్టర్ ఫొటో!
బాలీవుడ్లో బడా స్టార్స్ అందర్నీ ఒక ఫ్రేమ్‌లోకి తీసుకురావాలంటే ఫస్ట్ వినిపించే పేరు కరణ్ జోహార్. తాజాగా మరోసారి బాలీవుడ్ టాప్ యాక్టర్స్ అందర్నీ ఒకే ఫ్రేమ్‌లో తీసుకొచ్చారు. అయితే ఈ సారి సినిమా కోసం కాదు. జస్ట్ చిన్న పార్టీ కోసం. రణ్‌బీర్ కపూర్ ఏర్పాటు చేసిన చిన్న పార్టీలో షారుక్, ఆమిర్, దీపికా పదుకోన్, కరణ్, రణ్వీర్, ఆలియా భట్ పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఈ ఫొటో క్లిక్ మనిపించారు. ఈ ఫొటోను షేర్ చేసి ‘అతి పెద్ద బ్లాక్‌బస్టర్ ఫొటో’ అని క్యాప్షన్ ఇచ్చారు. షారుక్, ఆమిర్ ఒకే ఫంక్షన్‌కి హాజరు కావడం, మాజీ ప్రేమికులు దీపికా, రణ్‌బీర్‌లు కూడా ఫొటోకి నవ్వుతూ పోజులివ్వడం విశేషం. -
అప్పుడు ఆలియా చిన్నపిల్ల
‘‘లాస్ట్ టైమ్ నేను హిందీ సినిమా చేసినప్పుడు ఆలియా భట్ చిన్నపిల్ల. ఇప్పుడు తనతో కలిసి యాక్ట్ చేస్తున్నాను’’ అని నవ్వుతూ అంటున్నారు నాగార్జున. రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్ ముఖ్య పాత్రల్లో దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఫ్యాంటసీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. 15 ఏళ్ల తర్వాత నాగార్జున నటిస్తున్న హిందీ చిత్రం ఇది. ఈ సినిమాలో యాక్ట్ చేయడం గురించి నాగ్ మాట్లాడుతూ – ‘‘లాస్ట్ టైమ్ హిందీ సినిమా ఎప్పుడు చేశానో సరిగ్గా గుర్తు లేదు. ‘బ్రహ్మాస్త్ర’ కథ చాలా నచ్చింది. తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను. ఈ టైమ్‌లో ఇలాంటి పాత్ర ఒకటి వస్తుందని ఊహించలేదు. స్టోరీ బావుంటే ఏ సినిమాలో అయినా యాక్ట్ చేయడానికి నేనెప్పుడూ రెడీ. అమితాబ్ తప్ప మిగతా అందరితో యాక్ట్ చేయడం ఫస్ట్ టైమ్. బల్గేరియాలో షూట్‌ని ఎంజాయ్ చేస్తున్నాను’’ అన్నారు. ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున రోల్ గురించి కరణ్ మాట్లాడుతూ – ‘‘ఇందులో నాగార్జున యాక్ట్ చేయడం హానర్డ్గా, ఎగై్జటింగ్‌గా అనిపిస్తోంది. మీ (నాగార్జున) ప్రేమకు, ఎనర్జీకి థ్యాంక్యూ’’ అని పేర్కొన్నారు. రెండు పార్ట్స్‌గా రూపొందుతోన్న ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఆగస్ట్‌లో రిలీజ్ కానుంది. అన్నట్లు ఈ షూటింగ్ లొకేషన్‌కి అమల కూడా వెళ్లారు. -
నాగ్ బ్రహ్మాస్త్రం
దాదాపు పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి హిందీ చిత్రంలో నాగార్జున నటించి. జేపీ దత్తా దర్శకత్వంలో 2003 రూపొందిన ‘ఎల్ఓసీ కార్గిల్’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేశారు నాగార్జున. అంతకు ముందు ‘శివ, ఖుదా గవా, క్రిమినల్, ద్రోహి’ వంటి హిందీ చిత్రాల్లో నటించారు. మళ్లీ ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’లో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు నాగ్. ‘ఏ జవానీ హై దీవానీ’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, నాగార్జున, ఆలియా భట్ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ జరిగిన బల్గేరియాలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టారై్టంది. ఈ షెడ్యూల్లో ఈ నెల 19వరకు నాగార్జున పాల్గొంటారని సమాచారం. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ మూడు పార్టులుగా నిర్మించాలనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. ‘బ్రహ్మాస్త్ర’ తొలి పార్ట్‌ను వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని గతంలో చిత్రబృందం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. -
కొత్త ఇడియట్!
తెలుగులో ‘ఇడియట్’ అనగానే... హీరో రవితేజ నటించిన చిత్రం గుర్తొస్తుంది. అదే త్రీ ఇడియట్స్ అంటే ఆమిర్‌ఖాన్, ఆర్. మాధవన్, శర్మాన్ జోషి నటించిన చిత్రం గుర్తొస్తుంది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ ముగ్గురూ ముఖ్య పాత్రలు చేసిన చిత్రం ‘త్రీ ఇడియట్స్’. రీసెంట్గా ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజ్‌కుమార్ హిరానీ హింట్ ఇచ్చారు. ఇప్పుడీ విషయాన్ని బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కన్ఫార్మ్ చేశారని బీటౌన్ టాక్. ‘‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్ ప్లాన్‌లో ఉన్నప్పుడు రాజ్సర్ నన్ను కలిశారు. గొప్ప ఫిల్మ్‌మేకర్. ఆయన దర్శకత్వంలో నటించడానికి రెడీ’’ అని పేర్కొన్నారు రణబీర్ కపూర్. అంటే ‘త్రీ ఇడియట్స్’ సినిమా సీక్వెల్ కోసం సిల్వర్ స్క్రీన్‌పై ఓ కొత్త ఇడియట్ దొరికాడన్నమాట. మరోవైపు రణబీర్‌కపూర్ హీరోగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలోనే రూపొందిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
సహజీవనం సరి కాదు
స్టార్ స్టేటస్‌ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లు పెళ్లి గురించి ప్రస్తావించడానికి ఎక్కువగా ఇష్టపడరు. కెరీర్ గ్రాఫ్ గురించో.. లేదా పర్శనల్ విషయాలు ప్రైవేట్‌గా ఉండటం కోసమో పెళ్లి ఊసెత్తితే చాలు మాట దాటేయటమో లేదా మౌనవ్రతం చేస్తుంటారు. కానీ ఆలియా భట్ అలా కాదు. 30కి ముందే మూడు ముళ్లు వేయించుకుంటానేమో? అంటున్నారు. పెళ్లి విషయం గురించి ఆలియా మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం పెళ్లి మీద ఎటువంటి ఆలోచనలు లేవు. హానెస్ట్‌గా చెప్పాలంటే ఈ విషయం ఇప్పుడు జరగాలి.. అది అప్పుడు జరగాలి అని ప్లాన్ చేసుకునే టైప్ కాదు నేను. ఆ క్షణంలో చేయాలనిపించింది చేసేస్తా. నా ఉద్దేశంలో ఏదైనా ఎక్స్పెక్ట్ చేయనప్పుడు జరిగితేనే అసలు కిక్కు. అందరూ నేను ముప్ఫై ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటాననుకుంటారేమో. దాని కంటే ముందే చేసుకొని సర్ప్రైజ్ చేస్తానేమో. నాకు లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద మంచి ఒపీనియన్ లేదు. సహజీవనం సరి కాదనన్నది నా అభిప్రాయం. అందుకే నాకు నచ్చినవాడు దొరికితే ‘ఐలవ్ యు. మనం పెళ్లి చేసుకుందాం, కలిసుందాం. పెళ్లి తర్వాత కూడా నేను వర్క్ చేస్తాను’ అని చెప్పేస్తాను’’ అని పేర్కొన్నారు ఆలియా భట్. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్‌హీరో రణ్‌బీర్‌తో లవ్‌లో ఉన్నారని టాక్. ఈ రిలేషన్‌షిప్‌ని ఉద్దేశిస్తూ ఆలియా ఇలా మాట్లాడి ఉంటారా? అంటే సన్నాయి మేళం వినిపించేదాకా చెప్పలేం. -
మనిషి ఒక్కడే.. పాత్రలు ఎన్నో
ఛార్టెడ్ ఫ్లైట్స్‌లో తిరిగిన స్టార్ హీరో బస్ జర్నీ చేయాల్సి వచ్చింది. న్యూయార్క్‌లోని హై బిల్డింగ్ విండోలో నుంచి ప్రపంచాన్ని చూసి విజయగర్వంతో నవ్విన అతను, అసలు విండోనే లేని జైలుగదిలో ఖైదీగా ఉండాల్సి వచ్చింది. డ్రగ్స్‌తో లైఫ్ క్లోజ్ అనుకున్న టైమ్‌లో జిమ్‌లో హార్డ్‌వర్క్ చేసి నార్మల్ లైఫ్‌లోకి వచ్చాడు. ఒక మనిషి జీవితంలో ఇన్ని జరుగుతాయా? అంటే.. అవును. బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ లైఫ్‌లో జరిగాయి. ఇంకా సంజయ్ జీవితంలో ఏమేం జరిగాయో తెలుసుకోవాలంటే ఆయన జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘సంజు’ చూడాల్సిందే. జూన్ 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘వన్ మ్యాన్ మెనీ లైఫ్స్’ అని ఫస్ట్ లుక్ పోస్టర్స్‌పై ఉంటడం విశేషం. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సంజయ్ దత్‌గా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నారు. ఇతర పాత్రలను సోనమ్‌కపూర్, పరేశ్‌రావల్, అనుష్కాశర్మ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ చూశాక.. సంజయ్‌దత్ పాత్రకు రణ్‌బీర్ కపూర్ కరెక్ట్‌గా సరిపోయాడని బీటౌన్ సెలబ్రిటీలు పొగిడేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే ట్రైలర్ లాంచ్ ప్రొగ్రామ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి రణ్‌బీర్‌ను అడిగితే– ‘‘నా దృష్టికి ఈ విషయం రాలేదు. ఇండస్ట్రీలో ఇలాంటిది ఉంటే అంతకంటే వరస్ట్ థింగ్ మరొకటి లేదు’’ అని అన్నారు. అలాగే సంజయ్‌దత్ బయోపిక్‌లో నటించడం చాలా ఆనందంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు రణ్‌బీర్. -
ఇది నకిలీ.. అసలు త్వరలో !
హీరోగా సంజయ్‌దత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్డమ్ సంపాదించుకున్నారు. కానీ కొన్ని అనుకోని సంఘటనలు ఆయన జీవితాన్ని మరింత పాపులర్ అండ్ ఇంట్రస్టింగ్‌గా చేశాయి. అందుకే ఆయన బయోగ్రఫీ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆల్రెడీ రణ్‌బీర్ సింగ్ హీరోగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో సంజయ్‌దత్ జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ ఏడాది విడుదల కానుంది. కానీ ఇంతలోనే సంజయ్‌దత్ బయోగ్రఫీ అంటూ ‘‘ది క్రేజీ అటోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ సంజయ్‌దత్’’ అనే టైటిల్‌తో ఓ బుక్ మార్కెట్లోకి వచ్చింది. ఈ బుక్ గురించి సంజయ్‌దత్ స్పందించారు. ‘‘మార్కెట్లో ఉన్న నా బయోగ్రఫీ బుక్కి, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ బుక్‌ని ప్రచురించినవాళ్లు నా అనుమతి తీసుకోలేదు. మా లాయర్స్ సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించడం జరిగింది. పబ్లిక్ డొమైన్లో లభించిన సమాచారం ఆధారంగా ఈ పుస్తకం రాయబడిందని సంబంధిత పుస్తక ప్రచురణ సంస్థ పేర్కొంది. కానీ వాటిలో ఉన్న విషయాలు నా పాత ఇంటర్వ్యూస్లోనివని తెలిసింది. అందులో అన్నీ నిజాలు లేవు. కొన్ని గాసిప్స్, చెప్పుడు మాటలు కూడా ఉన్నాయి’’ అని అన్నారు. ఆయన ఇంకా చెబుతూ– ‘‘ఇక ఏ ఇతర రచయితలు నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందిపెట్టరని భావిస్తున్నాను. నా అఫీషియల్ బయోగ్రఫీని త్వరలోనే విడుదల చేస్తాం. అందులో ఉన్న సంగతులే వాస్తవమైనవి’’ అన్నారు. -
మహిళా ఫ్యాన్‌ను ఎలా తిట్టాడో చూడండి
సాక్షి, ముంబయి : తన షార్ట్ టెంపర్‌తో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలిచే ప్రముఖ నటుడు రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషీ కపూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఫొటో దిగేందుకు ముచ్చటపడి ముందుకు వచ్చిన ఓ మహిళా అభిమానిపై నోరు పారేసుకున్నారు. ఆమెను చెడామడా మాటలు అంటుంటే అక్కడే ఉన్న ఆయన కుమారుడు, ప్రముఖ హీరో రణ్‌బీర్ కపూర్ ఒక్కమాటమాట్లాడకుండా ఉండిపోయారు. ఫ్యామిలీతో కలిసి ముంబయిలోని బాంద్రాలో పోష్ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆయన అలా గట్టిగా తిట్టడంతో ఆ అభిమాని కూడా కంటతడి పెట్టింది. ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చెక్కర్లు కొడుతోంది.. దానిపై మీరు ఓ లుక్కేయండి మరీ ! -
రణ్‌బీర్ బ్రహ్మాస్త్రం తీశాడు..!
రణ్‌బీర్ కపూర్‌పై బాలీవుడ్‌కు భారీ ఆశలున్నాయి. నెక్ ్స›్టసూపర్స్టార్ రణ్‌బీరే అని అందరూ అనుకోవడం ఎప్పుడూ జరిగేదే! అయితే యాక్టింగ్ పరంగా ది బెస్ట్ అనిపించుకుంటాడు కానీ, బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ హిట్ ఎప్పుడూ కొట్టలేక పోతుంటాడు. ప్రస్తుతానికి బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానితో ‘సంజు’ సినిమా చేస్తున్నాడు రణ్‌బీర్. బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మార్చిలో రిలీజ్. ఈ సినిమాతో రణ్‌బీర్ బాలీవుడ్లో టాప్ రేసులోకి దూసుకెళతాడని ట్రేడ్ భావిస్తోంది. దీని తర్వాత వచ్చే సినిమా కూడా అదే రేంజ్లో ఉండాలని రణ్‌బీర్ భావిస్తున్నాడట. అందుకే ఈసారి ఏకంగా బ్రహ్మాస్త్రం తీశాడు. బ్రహ్మాస్త్రం అంటే మామూలు విషయమా? శక్తులన్నీ కూడగట్టి బలాన్ని చూపించడం. ‘వేక్ అప్ సిద్’, ‘యే జవానీ హై దీవానీ’ సినిమాలతో తనకు సూపర్‌హిట్స్ ఇచ్చిన అయాన్ ముఖర్జీతో హ్యాట్రిక్ కోసం ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్‌తో వచ్చేస్తున్నాడు రణ్‌బీర్. ఇందులో హీరోయిన్ ఆలియా భట్. అమితాబ్ బచ్చన్ కీ రోల్లో కనిపిస్తారు. ఇదొక సూపర్ హీరో జానర్ అని టాక్. ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళుతుందీ సినిమా. ఇప్పటికే టీమ్ ఇజ్రాయిల్‌లో లొకేషన్ హంట్‌లో ఉంది. ‘సంజు’, ‘బ్రహ్మాస్త్ర’ ప్లాన్ చేసినట్లుగా, అందరూ అనుకున్నట్లుగా పెద్ద కమర్షియల్ హిట్స్ అయిపోతే రణ్‌బీర్ టాప్ రేసులోకి వెళ్లినట్టే!!! -
రణ్‌బీర్‌తో అయితే ఓకే!
తన యోగా వీడియోతో శిల్పాశెట్టి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా తన అందం తరిగిపోకుండా ఉండటానికి కారణం యోగానే అంటారు శిల్పాశెట్టి. ఆరోగ్యంపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసే క్రమంలో తాను మరో అడుగు వేస్తున్నట్లు, న్యూట్రిషన్, ఫిట్నెస్ అంశాలపై ఓ పుస్తకం రాయనున్నట్లు ముంబయ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శిల్పా ప్రకటించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘బరువు తగ్గాలనుకునేవారు పాటించాల్సిన నియమాలే ఈ పుస్తకంలో ప్రధానాంశం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు కడుపు మాడ్చుకుంటుంటారు. నేను ఆ పద్ధతికి వ్యతిరేకిని. నిజంగా వెయిట్ లాస్ కావాలనుకునేవారు ఉపవాసాలు చేయక్కర్లేదు. క్రమ పద్ధతిలో పౌష్టికాహారం తీసుకుంటే చాలు. బరువు తగ్గాలనుకునేవారికి ముఖ్యంగా కావాల్సింది ఆశావహ దృక్పథం, దృఢ సంకల్పం. ఈ రెండూ ఉంటే బరువు తగ్గడం పెద్ద విషయం కాదు. నా పుస్తకంలో ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి’’ అని శిల్పా తెలిపారు. ‘‘ఈ వయసులో కూడా చెక్కు చెదరని గ్లామర్‌తో మెరిసిపోతున్నారు. మళ్లీ హీరోయిన్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయొచ్చు కదా?’’ అని అడగ్గా -‘‘రణ్బీర్కపూర్కి జోడీగా అయితే చెప్పండి... నటించేస్తా’’ అంటూ సరదాగా ఓ చమక్కు విసిరారు శిల్పాశెట్టి.