కొత్త అవతారం | Sanjay Dutt to play roaring villain against reel life Sanju Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

కొత్త అవతారం

Published Sat, Dec 1 2018 12:32 AM | Last Updated on Sat, Dec 1 2018 12:32 AM

Sanjay Dutt to play roaring villain against reel life Sanju Ranbir Kapoor - Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌

బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో చూస్తారని అంటున్నారు దర్శకుడు కరణ్‌ మల్హోత్రా. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘షంషేర్‌’. వాణీకపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్‌దత్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం ముంబైలో జరిగింది.

ఈ సినిమా షూటింగ్‌ నేటి నుంచి ప్రారంభం అవుతుంది. ‘‘మంచి టీమ్‌ కుదిరింది. ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. రణ్‌బీర్‌కపూర్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో చూస్తారు. వచ్చే ఏడాది జూలై కల్లా సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు కరణ్‌ మల్హోత్రా. ఈ సినిమా కాకుండా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నారు రణ్‌బీర్‌. ఈ చిత్రం తొలిపార్ట్‌ వచ్చే ఏడాది క్రిస్మస్‌కు విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement