Vani Kapur
-
చలో స్కాట్‌ల్యాండ్
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్వదేశంలో షూటింగ్ అంటేనే రిస్క్.. ఇక విదేశాల్లో షూటింగ్ ఎలా? అని సినిమా ఇండస్ట్రీ ఆలోచిస్తోంది. కానీ విదేశాల్లో షూటింగ్ కి సంబంధించిన ప్లానింగ్ మాత్రమే కాదు.. ప్రయాణం కూడా మొదలెట్టారు అక్షయ్ అండ్ టీమ్. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘బెల్ బాటమ్’. రంజిత్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వాణీకపూర్ కథానాయిక. లారా దత్, హ్యూమా ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డిటెక్టివ్ పాత్రలో అక్షయ్ కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం 120 మంది స్కాట్ ల్యాండ్ ప్రయాణమయ్యారు. లాక్ డౌన్ తర్వాత విదేశాల్లో షూట్ చేయనున్న చిత్రమిదే. ప్రభుత్వ గైడ్ లైన్స్ అనుసరిస్తూ చిత్రీకరణ ప్లాన్ చేశారు. చిత్ర యూనిట్ అందరికీ స్పెషల్ రిస్ట్ బ్యాండ్లు అందించారట. దీంతో ఎప్పటికప్పుడు ఆ వ్యక్తి బ్లడ్ ప్రెషర్, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లెవెల్.. అన్నీ తెలుసుకోవచ్చు. స్కాట్ ల్యాండ్ వెళ్లిన తర్వాత కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉన్న తర్వాతే చిత్రీకరణకు సంబంధించిన పనులు మొదలు పెడతారట. ‘‘మళ్ళీ షూటింగ్ తో బిజీ అయ్యే టైమ్ రావడం చాలా బావుంది’’ అన్నారు అక్షయ్ కుమార్. -
గన్‌దరగోళం
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ఒకరి మీద ఒకరు యుద్ధం ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ను ఢీ కొట్టడానికి టైగర్ ప్రపంచంలోనే పవర్ఫుల్ మెషీన్‌గన్ ‘గాట్లింగ్’తో వాడబోతున్నారని తెలిసింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం ‘వార్’. యశ్ చోప్రా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. యాక్షన్ చిత్రాల ప్రేమికులకు కనువిందులా ఉండేందుకు అద్భుతమైన లొకేషన్స్‌లో యాక్షన్ సీన్లు చిత్రీకరించారు. ఓ సన్నివేశంలో ఈ మెషీన్గన్తో సిటీని ధ్వంసం చేస్తూ గన్‌దరగోళం సృష్టిస్తారట టైగర్. ఈ సీన్స్ సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తాయట. వాణీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. -
విదేశాల్లో వార్
భూమి, సముద్రం, మంచుపై మాత్రమే కాదు గాలిలో కూడా ఫైట్ చేస్తున్నారట హృతిక్ రోషన్ అండ్ టైగర్ ష్రాఫ్. ఈ పవర్ఫుల్ ఫైట్స్‌ని పావెల్ జెన్నింగ్స్, ఫ్రాంజ్ స్పిల్హాస్, సా యంగ్ ఓహ్, పర్వేజ్ షేక్ ఈ నలుగురు హాలీవుడ్ స్టంట్‌మాస్టర్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ‘వార్’. ఇందులో వాణీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు అబ్బురపరిచేలా ఉన్నాయి టీజర్లో. ఇటీవల ఫిన్ల్యాండ్లోని ఆర్కిటిక్ సర్కిల్లో ఓ భారీ కార్ ఛేజింగ్ యాక్షన్ సీన్‌ను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ పావెల్ జెన్నింగ్స్ డిజైన్ చేశారు. ఇంతకు ముందు డార్క్ నైట్, జాక్ రేచర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి చిత్రాలకు వర్క్ చేశారు పావెల్. ఈ సీన్ కోసం హృతిక్, టైగర్ ముందుగా బాగా ప్రాక్టీస్ చేశారట. ఫిన్ల్యాండ్లోని ఆర్కిటిక్ సర్కిల్లో యాక్షన్ సీన్‌ను తెరకెక్కించిన తొలి బాలీవుడ్ మూవీ ఇదేనట. ఇండియా లొకేషన్స్‌తో పాటుగా ఆస్ట్రేలియా, పోర్చుగల్, ఇటలీ, స్విట్జర్లాండ్, స్పీడన్ దేశాల్లోని పదిహేను ముఖ్యనగరాల్లో ఈ సినిమా చిత్రీకరణను టీమ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ‘వార్’ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. -
యుద్ధానికి సిద్ధం
బాలీవుడ్ యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్. ప్రస్తుతం ఈ ఇద్దరూ స్క్రీన్‌మీద యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. మరి వీళ్ల ఫైట్ దేనికోసమో తెలియాలి. హృతిక్, టైగర్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్’. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వాణీకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. బైక్ స్టంట్స్, గన్ ఫైరింగ్, చేజ్లు, ఫైట్స్‌తో నిండిన ఈ టీజర్ భారీ యాక్షన్ చిత్రాన్ని అందించనున్నాం అనే ప్రామిస్ చేస్తోంది. హిందీ, తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో అక్టోబర్ 2న ‘వార్’ సినిమా విడుదల కానుంది. -
డబుల్ ధమాకా?
రణ్‌బీర్ కపూర్, సంజయ్ దత్, వాణీ కపూర్ ముఖ్యతారలుగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘షంషేరా’. ఆదిత్యాచోప్రా నిర్మిస్తున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అడవిలో ఉన్న ఓ తెగ ఏ విధంగా పోరాటం చేసిందనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇందులో బందిపోటు పాత్రలో నటిస్తున్నారు రణ్‌బీర్‌కపూర్. డబుల్ యాక్షన్... అంటే తండ్రీకొడుకుల పాత్రల్లో నటిస్తున్నారట రణ్‌బీర్. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ రణ్‌బీర్ ద్విపాత్రాభినయం చేయలేదట. మరి.. ప్రచారంలో ఉన్నట్లుగా రణ్‌బీర్ రెండు పాత్రలు చేస్తున్నారా? లేదా అనేది వచ్చే ఏడాది జూలైలో తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అప్పుడే. ఇక ఈ సినిమా కాకుండా పీరియాడికల్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో నటిస్తున్నారు రణ్‌బీర్. వ్యక్తిగత విషయాని కొస్తే.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌తో రణ్‌బీర్ ప్రేమలో ఉన్నారని తెలిసిందే. -
కొత్త అవతారం
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో చూస్తారని అంటున్నారు దర్శకుడు కరణ్ మల్హోత్రా. రణ్‌బీర్ కపూర్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘షంషేర్’. వాణీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్‌దత్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం ముంబైలో జరిగింది. ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి ప్రారంభం అవుతుంది. ‘‘మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. రణ్‌బీర్‌కపూర్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో చూస్తారు. వచ్చే ఏడాది జూలై కల్లా సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు కరణ్ మల్హోత్రా. ఈ సినిమా కాకుండా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నారు రణ్‌బీర్. ఈ చిత్రం తొలిపార్ట్ వచ్చే ఏడాది క్రిస్మస్కు విడుదల కానుంది. -
చాలా గర్వపడుతున్నాను - నాని
‘‘దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్. చిన్నప్పట్నుంచీ వారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆ సంస్థలో హీరోగా నటించినందుకు చాలా గర్వపడుతున్నాను’’ అని నాని అన్నారు. నాని, వాణీకపూర్ జంటగా గోకుల్‌కృష్ణ దర్శకత్వంలో యశ్‌రాజ్ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం ‘ఆహా కళ్యాణం’. ఆదిత్య చోప్రా నిర్మాత. ధరన్‌కుమార్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దిల్’రాజు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని సునీల్‌కి అందించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ -‘‘దర్శకుని సున్నితత్వం చూసి ‘ఏం తీస్తాడో...’ అనుకున్నాను. కానీ షూటింగ్ మొదలైన రెండో రోజే అతని ప్రతిభ ఏంటో తెలిసింది. అందరి అభిప్రాయాలూ తీసుకొని జనరంజకంగా సినిమా తీశారు. ‘బ్యాండ్‌బాజా బారాత్’ చిత్రానికి ఇది రీమేక్ అయినప్పటికీ... మన నేటివిటీ ఎక్కడా మిస్ కాదు. వాణీకపూర్కి తెలుగు రాకపోయినా... అర్థం చేసుకుని నటించింది. పేరుకు తగ్గట్టుగా సందడిగా సాగే సినిమా ఇది’’ అని చెప్పారు. 40 ఏళ్లుగా హిందీ చిత్రరంగంలో ఉన్న తాము తొలిసారిగా తెలుగు, తమిళ సినీ రంగాల్లో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని యశ్‌రాజ్ ఫిలింస్ ప్రతినిధి పదమ్‌కుమార్ అన్నారు. యశ్‌రాజ్ సంస్థలో పనిచేయడం గర్వంగా ఉందని, అందరికీ నచ్చే క్లీన్ ఎంటర్టైనర్ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ‘‘ఈ సంస్థలో నాకిది రెండో సినిమా. నేను, నాని ఇందులో వెడ్డింగ్ ప్లానర్లుగా నటించాం. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’’ అని వాణీకపూర్ ఆకాంక్షించారు. రానా, కృష్ణచైతన్య, కరుణాకరన్ తదితరులు కూడా మాట్లాడారు.