హృతిక్ రోషన్
భూమి, సముద్రం, మంచుపై మాత్రమే కాదు గాలిలో కూడా ఫైట్ చేస్తున్నారట హృతిక్ రోషన్ అండ్ టైగర్ ష్రాఫ్. ఈ పవర్‌ఫుల్ ఫైట్స్‌ని పావెల్ జెన్నింగ్స్, ఫ్రాంజ్ స్పిల్హాస్, సా యంగ్ ఓహ్, పర్వేజ్ షేక్ ఈ నలుగురు హాలీవుడ్ స్టంట్‌మాస్టర్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ‘వార్’. ఇందులో వాణీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు అబ్బురపరిచేలా ఉన్నాయి టీజర్‌లో.
ఇటీవల ఫిన్‌ల్యాండ్‌లోని ఆర్కిటిక్ సర్కిల్‌లో ఓ భారీ కార్ ఛేజింగ్ యాక్షన్ సీన్‌ను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ పావెల్ జెన్నింగ్స్ డిజైన్ చేశారు. ఇంతకు ముందు డార్క్ నైట్, జాక్ రేచర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి చిత్రాలకు వర్క్ చేశారు పావెల్. ఈ సీన్ కోసం హృతిక్, టైగర్ ముందుగా బాగా ప్రాక్టీస్ చేశారట. ఫిన్‌ల్యాండ్‌లోని ఆర్కిటిక్ సర్కిల్‌లో యాక్షన్ సీన్‌ను తెరకెక్కించిన తొలి బాలీవుడ్ మూవీ ఇదేనట. ఇండియా లొకేషన్స్‌తో పాటుగా ఆస్ట్రేలియా, పోర్చుగల్, ఇటలీ, స్విట్జర్లాండ్, స్పీడన్ దేశాల్లోని పదిహేను ముఖ్యనగరాల్లో ఈ సినిమా చిత్రీకరణను టీమ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ‘వార్’ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment