రణ్‌బీర్‌తో అయితే ఓకే! | Shilpa Shetty to venture into yoga, physiotherapy biz | Sakshi
Sakshi News home page

రణ్‌బీర్‌తో అయితే ఓకే!

Published Sat, Oct 18 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

రణ్‌బీర్‌తో అయితే ఓకే!

రణ్‌బీర్‌తో అయితే ఓకే!

తన యోగా వీడియోతో శిల్పాశెట్టి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా తన అందం తరిగిపోకుండా ఉండటానికి కారణం యోగానే అంటారు శిల్పాశెట్టి. ఆరోగ్యంపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసే క్రమంలో తాను మరో అడుగు వేస్తున్నట్లు, న్యూట్రిషన్, ఫిట్‌నెస్ అంశాలపై ఓ పుస్తకం రాయనున్నట్లు ముంబయ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శిల్పా ప్రకటించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘బరువు తగ్గాలనుకునేవారు పాటించాల్సిన నియమాలే ఈ పుస్తకంలో ప్రధానాంశం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు కడుపు మాడ్చుకుంటుంటారు.

నేను ఆ పద్ధతికి వ్యతిరేకిని. నిజంగా వెయిట్ లాస్ కావాలనుకునేవారు ఉపవాసాలు చేయక్కర్లేదు. క్రమ పద్ధతిలో పౌష్టికాహారం తీసుకుంటే చాలు. బరువు తగ్గాలనుకునేవారికి ముఖ్యంగా కావాల్సింది ఆశావహ దృక్పథం, దృఢ సంకల్పం. ఈ రెండూ ఉంటే బరువు తగ్గడం పెద్ద విషయం కాదు. నా పుస్తకంలో ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి’’ అని శిల్పా తెలిపారు. ‘‘ఈ వయసులో కూడా చెక్కు చెదరని గ్లామర్‌తో మెరిసిపోతున్నారు. మళ్లీ హీరోయిన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయొచ్చు కదా?’’ అని అడగ్గా -‘‘రణ్‌బీర్‌కపూర్‌కి జోడీగా అయితే చెప్పండి... నటించేస్తా’’ అంటూ సరదాగా ఓ చమక్కు విసిరారు శిల్పాశెట్టి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement