ప్రేమతో కేక్‌ | Alia Bhatt bakes a special birthday cake for boyfriend Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

ప్రేమతో కేక్‌

Published Sun, Sep 30 2018 6:29 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Alia Bhatt bakes a special birthday cake for boyfriend Ranbir Kapoor - Sakshi

ఆలియా భట్‌

రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌లో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ వాళ్లు మాత్రం ఒప్పుకోవడం లేదు. అయితే వీలు చిక్కినప్పుడల్లా కాస్త దగ్గరగానే సమయాన్ని గడుపుతున్నారు. శుక్రవారం రణ్‌బీర్‌ కపూర్‌ పుట్టినరోజు. ఈ ఏడాదితో 36వ వసంతంలోకి అడుగుపెట్టారాయన. బర్త్‌డే సందర్భంగా ఆలియా భట్‌ ఇంటికి వెళ్లి లంచ్‌ కూడా చేశారు రణ్‌బీర్‌. బర్త్‌డే బాయ్‌ కోసం స్పెషల్‌గా ఏదైనా చేయాలనుకున్న ఆలియా భట్‌ స్వయంగా కేక్‌ తయారు చేశారు. ఈ కేక్‌ తయారీ కోసం చెఫ్‌ హర్ష ఆమెకు సహాయం చేశారు.

అన్నట్లు.. ఈ కేక్‌ను తయారు చేయడంలో ఆలియాకు హర్ష ఇచ్చిన సలహా ఏంటో తెలుసా...‘‘కేక్‌ను బేక్‌ చేయాలంటే కావాల్సిన ముఖ్యమైన పదార్థం ముఖంపై నవ్వు. ఒకవేళ నవ్వు రాకపోతే పేస్ట్రీ క్రీమ్‌ను కాస్త నాకు’’ అని సలహా ఇచ్చారట సరదాగా. కేక్‌ రెడీ చేస్తున్న ఫొటోలను షేర్‌ చేశారు హర్ష. హ్యాపీ బర్త్‌డే ‘సన్‌షైన్‌’ అంటూ రణ్‌బీర్‌ నవ్వుతున్న ఫొటోను షేర్‌ చేశారు ఆలియా. ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో రణ్‌బీర్, ఆలియా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ప్రేమలో పడింది ఈ సెట్‌లోనే అని టాక్‌. సో.. స్క్రీన్‌పై రొమాంటిక్‌ సీన్స్‌లో కెమిస్ట్రీ బాగుంటుందన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement