ఆమె ఒక స్టార్ హీరోయిన్.. వామ్మో ఇన్ని కోట్ల ఆస్తులా? | Bollywood Actress Alia Bhatt Net Worth 2023: Know How Rich Is She Now? - Sakshi
Sakshi News home page

అందాల భామ ఆలియా భట్.. సినిమాల కంటే అందులోనే కోట్ల ఆదాయం!

Published Wed, Aug 30 2023 6:07 PM | Last Updated on Wed, Aug 30 2023 6:48 PM

Bollywood superstar Alia Bhatt is one of the most popular actress In Business - Sakshi

సినీ ఇండస్ట్రీలో  తారల ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక స్టార్స్‌గా ఎదిగినా వారికైతే కోట్లలో పారితోషికాలు ఇచ్చుకోవాల్సిందే. సినిమాలే కాకుండా ఇంకా ప్రకటనల్లో నటిస్తూ కోట్లలోనే గడిస్తూ ఉంటారు. అది సినీ ఇండస్ట్రీలోని స్టార్ ముద్ర వేసుకున్న నటీనటుల రేంజ్. సాధారణంగా హీరోయిన్ల కంటే.. హీరోల రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎంత స్టార్ హీరోయిన్ అయినా సరే పారితోషికం విషయానికి వచ్చేసరికి కాస్తా తక్కువే. అయితే కేవలం వాటితోనే కాకుండా బిజినెస్‌లోనూ కోట్లు గడించేవారు ఉన్నారు. అలాంటి వారిలో ముందువరుసలో వినిపించే పేరు ఆలియా భట్. ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆదాయం హీరోలకు ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. అసలు ఆ స్టోరీ ఏంటో ఓ లుక్కేద్దాం. 

(ఇది చదవండి:  హీరోయిన్‌కు ముద్దు.. ఘాటుగానే స్పందించిన డైరెక్టర్!)

రూ.560 కోట్ల ఆస్తులు

బాలీవుడ్ భామ హీరోయిన్‌ మాత్రమే కాదు. మంచి బిజినెస్ ఉమెన్ కూడా. ఆమెకు దాదాపు రూ.150 కోట్ల రూపాయల విలువైన 'యాడ్-ఎ-మామా' అనే ప్రసిద్ధ దుస్తుల బ్రాండ్‌ను కలిగి ఉంది. ఈ బిజినెస్ ద్వారా అలియా భట్ విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అలియా భట్ ఇప్పటికే స్టార్‌ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. గతేడాది బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న అలియా భట్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ. 560 కోట్ల విలువతో భారతదేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన హీరోయిన్‌గా నిలిచింది. 

ఆలియా భట్ ఆస్తులు

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ విలాసవంతమైన మూడు ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. లండన్‌లో ఒకటి ఉండగా.. ముంబైలోని జుహు,  బాంద్రాలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ప్రస్తుతానికి అలియా సోదరి షాహీన్ జుహూ ఇంట్లో ఉంటోంది. అలియా మొదటిసారి ఇంటిని ఇండియాలో కాకుండా లండన్‌లోనే కొనుగోలు చేసిందట.  గతంలో లండన్‌లో సొంతిల్లు ఉండాలనేది తన కల అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అలియా భట్ లండన్ ఇంటి విలువ రూ.25 కోట్ కాగా.. అది కోవెంట్ గార్డెన్‌లో ఉంది. 

2020లో అలియా భట్ బాంద్రాలో ఒక ఇంటిని కొనుగోలు చేసింది. వాస్తు పాలి హిల్స్ కాంప్లెక్స్ ఐదో అంతస్తులో ఉన్న ఈ ఇంటి ఖరీదు దాదాపు రూ.40 కోట్లు కాగా.. అదే బిల్డింగ్ కాంప్లెక్స్‌లోని ఏడో అంతస్తులో రణబీర్ కపూర్‌కు కూడా ఓ ఇల్లు ఉంది. బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌ కారు రూ. 2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్‌తో పాటు  అలియా భట్‌కు ఇంకా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆమె వద్ద ప్రస్తుతం 3 ఆడి కార్లు ఉన్నాయి. 

(ఇది చదవండి: అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?)

రూ.150 కోట్ల బిజినెస్
అలియా భట్ తాన సొంతంగా 'యాడ్-ఎ-మామా' పేరుతో దుస్తుల బ్రాండ్ 2020లో ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ ఇప్పుడు రూ. 150 కోట్లకు చేరుకుంది. ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ అలియా భట్ కంపెనీని రూ. 300-350 కోట్లకు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అంతే కాకుండా అలియా భట్ ఒక ప్రొడక్షన్ హౌస్‌కు యజమాని కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె 2019లో ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ పేరుతో దీన్ని లాంఛ్ చేసింది. ప్రొడక్షన్ హౌస్ పేరుతో ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో 38 కోట్ల రూపాయల విలువైన అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసింది బాలీవుడ్ భామ. ఒకవైపు నటనతో పాటు.. మరోవైపు బిజినెస్‌లోనూ సక్సెస్‌ సాధిస్తూ కోట్లు గడిస్తున్న హీరోయిన్లలో టాప్ ప్లేస్‌లో ఆలియా భట్ కొనసాగుతోంది. ఈ రేంజ్‌లో సంపాదిస్తున్న ఇప్పటి స్టార్‌ హీరోయిన్లు నయనతార, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యరాయ్, సమంత కూడా ఆలియాకు పోటీనిచ్చే స్థాయిలో లేరని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement