కెరీర్‌లో దూసుకెళుతున్నప్పుడు పెళ్లి చేసుకోవడం, తల్లి కావడం అనేది సరైన నిర్ణయం కాదని కథానాయికలకు కొందరు చెబుతుంటారు. ఇదే విషయం గురించి ఆలియా భట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – ‘‘నేనెప్పుడూ నా మనసు చెప్పింది వింటాను. జీవితాన్ని మనం ప్లాన్ చేయలేం. జీవితమే ΄్లాన్ చేస్తుంది. నా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను.. తల్లిని కూడా అయ్యాను.
పెళ్లి చేసుకున్నంత మాత్రాన, తల్లయినంత మాత్రాన చేసే వృత్తిలో మార్పులు వస్తాయా.. ఎవరన్నారు? ఓ నటిగా నా మీద నాకు నమ్మకం ఉంది. మనం మంచి యాక్టర్ అయినప్పుడు, కష్టపడి పని చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు పని దానంతట అది మన దగ్గరకు వస్తుంది. ఒకవేళ రాలేదనుకుంటే.. ఇది మన టైమ్ కాదనుకోవాలి. అయినా నేను పని గురించి పెద్దగా ఆలోచించి, ఒత్తిడికి గురి కాను. తల్లి కావాలని నేను తీసుకున్న నిర్ణయానికి జీవితంలో ఎప్పుడూ పశ్చాత్తాపపడను.
ఇంకా చెప్పాలంటే పెళ్లి, తల్లి కావడం అనేవి నా జీవితంలో నేను తీసుకున్న గొప్ప నిర్ణయాలు’’ అన్నారు. ఇక గత ఏడాది రణ్‌బీర్ కపూర్–ఆలియాల వివాహం జరిగిన విషయం తెలిసిందే. నవంబర్‌లో ఆలియా ΄పాపకు జన్మనిచ్చారు. కుమార్తెకు ‘రాహా’ అని పేరు పెట్టారు. ఈ పేరుకి అర్థం చెబుతూ – ‘‘రాహా అంటే ‘ఆధ్యాత్మిక బాట’ అని ఓ అర్థం. ఇంకా ఉపశమనం, విశ్రాంతి, సౌకర్యం, ఆనందం, స్వేచ్ఛ.. ఇలా ఒక్కో భాషల్లో ఒక్కో అర్థం ఉంది. మా జీవితాల్లోకి రాహా రావడం మా కుటుంబం మొత్తానికీ ఆనందం ఇచ్చింది. మా జీవితాలు ఇప్పుడే మొదలైనట్లుగా అనిపిస్తోంది. నాకైతే జీవితం పరిపూర్ణంగా ఉన్నట్లనిపిస్తోంది’’ అన్నారు ఆలియా.
Comments
Please login to add a commentAdd a comment