రణ్‌బీర్‌ అంటే అప్పటి నుంచే ఇష్టం: అలియా | Alia Bhatt Always Wanted to Marry Ranbir Kapoor Heres What Actress Said Once | Sakshi
Sakshi News home page

Alia Bhatt and Ranbir kapoor: రణ్‌బీర్‌ అంటే అప్పటి నుంచే ఇష్టం: అలియా

Published Wed, Oct 6 2021 4:10 PM | Last Updated on Wed, Oct 6 2021 4:25 PM

Alia Bhatt Always Wanted to Marry Ranbir Kapoor Heres What Actress Said Once - Sakshi

బాలీవుడ్‌ నటి అలియా భట్‌, నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ముడేళ్లుగా ప్రేమలో విహరిస్తున్న ఈ కపుల్‌ పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో ఓ ఈవెంట్‌లో అలియా బాయ్‌ఫ్రెండ్‌ రణ్‌బీర్‌ గురించి మాట్లాడిన విషయాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

ఆ ఈవెంట్‌ అలియా మాట్లాడుతూ.. ‘రణ్‌బీర్‌పై నాకు చిన్నప్పటి నుంచే క్రష్‌ ఉంది. అందుకే ఆయన వాల్‌ పోస్టర్‌ని నా బెడ్రూమ్‌లో పెట్టుకున్నా. చిన్నప్పుడు ఓ సారి రణ్‌బీర్‌ని కలిశా. ఆ సమయంలో అతని భుజంపై తల పెట్టుకొని ఓ ఫోటో తీయించుకోవాలనుకున్నా.. కానీ విపరీతమైన సిగ్గు ఉండడంతో అలా చేయలేకపోయా’ అని చెప్పింది. అంతేకాకుండా ఈ చాక్లెట్‌ బాయ్‌ని పెళ్లి చేసుకోవాలని కలలు కనేదని ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో ఈ బ్యూటీ తెలిపింది.

అయితే అలియా కంటే ముందు రణ్‌బీర్‌, కత్రినా కైఫ్‌తో ప్రేమలో ఉండేవాడు. వారిద్దరి బ్రేకప్‌ అనంతరం ఈ జంట డేటింగ్‌ చేయడం ప్రారంభించారు. కాగా ఇటీవలే ఈ లవర్‌బాయ్‌ 39 బర్త్‌డే సందర్భంగా జోధ్‌పూర్‌లో ఎంజాయ్‌ చేసోచ్చింది ఈ కపుల్‌.

చదవండి: ప్రేయసితో రణబీర్‌ బర్త్‌ డే పార్టీ.. ఒక్క రాత్రికి రూ.1.65 లక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement