
ఛార్టెడ్ ఫ్లైట్స్‌లో తిరిగిన స్టార్ హీరో బస్ జర్నీ చేయాల్సి వచ్చింది. న్యూయార్క్‌లోని హై బిల్డింగ్ విండోలో నుంచి ప్రపంచాన్ని చూసి విజయగర్వంతో నవ్విన అతను, అసలు విండోనే లేని జైలుగదిలో ఖైదీగా ఉండాల్సి వచ్చింది. డ్రగ్స్‌తో లైఫ్ క్లోజ్ అనుకున్న టైమ్‌లో జిమ్‌లో హార్డ్‌వర్క్ చేసి నార్మల్ లైఫ్‌లోకి వచ్చాడు. ఒక మనిషి జీవితంలో ఇన్ని జరుగుతాయా? అంటే.. అవును. బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ లైఫ్‌లో జరిగాయి. ఇంకా సంజయ్ జీవితంలో ఏమేం జరిగాయో తెలుసుకోవాలంటే ఆయన జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘సంజు’ చూడాల్సిందే. జూన్ 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘వన్ మ్యాన్ మెనీ లైఫ్స్’ అని ఫస్ట్ లుక్ పోస్టర్స్‌పై ఉంటడం విశేషం.
రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సంజయ్ దత్‌గా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నారు. ఇతర పాత్రలను సోనమ్‌కపూర్, పరేశ్‌రావల్, అనుష్కాశర్మ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ చూశాక.. సంజయ్‌దత్ పాత్రకు రణ్‌బీర్ కపూర్ కరెక్ట్‌గా సరిపోయాడని బీటౌన్ సెలబ్రిటీలు పొగిడేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే ట్రైలర్ లాంచ్ ప్రొగ్రామ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి రణ్‌బీర్‌ను అడిగితే– ‘‘నా దృష్టికి ఈ విషయం రాలేదు. ఇండస్ట్రీలో ఇలాంటిది ఉంటే అంతకంటే వరస్ట్ థింగ్ మరొకటి లేదు’’ అని అన్నారు. అలాగే సంజయ్‌దత్ బయోపిక్‌లో నటించడం చాలా ఆనందంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు రణ్‌బీర్.
Comments
Please login to add a commentAdd a comment