రణ్‌బీర్‌ బ్రహ్మాస్త్రం తీశాడు..! | Ranbir Kapoor, Alia Bhatt prep for Brahmastra; Kareena Kapoor's Vogue cover: | Sakshi
Sakshi News home page

రణ్‌బీర్‌ బ్రహ్మాస్త్రం తీశాడు..!

Published Thu, Jan 4 2018 1:22 AM | Last Updated on Thu, Jan 4 2018 1:22 AM

Ranbir Kapoor, Alia Bhatt prep for Brahmastra; Kareena Kapoor's Vogue cover: - Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌పై బాలీవుడ్‌కు భారీ ఆశలున్నాయి. నెక్‌ ్స›్టసూపర్‌స్టార్‌ రణ్‌బీరే అని అందరూ అనుకోవడం ఎప్పుడూ జరిగేదే! అయితే యాక్టింగ్‌ పరంగా ది బెస్ట్‌ అనిపించుకుంటాడు కానీ, బాక్సాఫీస్‌ వద్ద ఓ రేంజ్‌ హిట్‌ ఎప్పుడూ కొట్టలేక పోతుంటాడు. ప్రస్తుతానికి బాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానితో ‘సంజు’ సినిమా చేస్తున్నాడు రణ్‌బీర్‌. బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌దత్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మార్చిలో రిలీజ్‌. ఈ సినిమాతో రణ్‌బీర్‌ బాలీవుడ్‌లో టాప్‌ రేసులోకి దూసుకెళతాడని ట్రేడ్‌ భావిస్తోంది. దీని తర్వాత వచ్చే సినిమా కూడా అదే రేంజ్‌లో ఉండాలని రణ్‌బీర్‌ భావిస్తున్నాడట.

అందుకే ఈసారి ఏకంగా బ్రహ్మాస్త్రం తీశాడు. బ్రహ్మాస్త్రం అంటే మామూలు విషయమా? శక్తులన్నీ కూడగట్టి బలాన్ని చూపించడం. ‘వేక్‌ అప్‌ సిద్‌’, ‘యే జవానీ హై దీవానీ’ సినిమాలతో తనకు సూపర్‌హిట్స్‌ ఇచ్చిన అయాన్‌ ముఖర్జీతో హ్యాట్రిక్‌ కోసం ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్‌తో వచ్చేస్తున్నాడు రణ్‌బీర్‌. ఇందులో హీరోయిన్‌ ఆలియా భట్‌. అమితాబ్‌ బచ్చన్‌ కీ రోల్‌లో కనిపిస్తారు. ఇదొక సూపర్‌ హీరో జానర్‌ అని టాక్‌. ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళుతుందీ సినిమా. ఇప్పటికే టీమ్‌ ఇజ్రాయిల్‌లో లొకేషన్‌ హంట్‌లో ఉంది. ‘సంజు’, ‘బ్రహ్మాస్త్ర’ ప్లాన్‌ చేసినట్లుగా, అందరూ అనుకున్నట్లుగా పెద్ద కమర్షియల్‌ హిట్స్‌ అయిపోతే రణ్‌బీర్‌ టాప్‌ రేసులోకి వెళ్లినట్టే!!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement