![Tollywood star Nagarjuna returns to Bollywood after 15 years - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/12/Nag.jpg.webp?itok=j5neb9F1)
దాదాపు పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి హిందీ చిత్రంలో నాగార్జున నటించి. జేపీ దత్తా దర్శకత్వంలో 2003 రూపొందిన ‘ఎల్‌ఓసీ కార్గిల్’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేశారు నాగార్జున. అంతకు ముందు ‘శివ, ఖుదా గవా, క్రిమినల్, ద్రోహి’ వంటి హిందీ చిత్రాల్లో నటించారు. మళ్లీ ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’లో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు నాగ్.
‘ఏ జవానీ హై దీవానీ’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, నాగార్జున, ఆలియా భట్ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ జరిగిన బల్గేరియాలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టారై్టంది. ఈ షెడ్యూల్‌లో ఈ నెల 19వరకు నాగార్జున పాల్గొంటారని సమాచారం. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ మూడు పార్టులుగా నిర్మించాలనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. ‘బ్రహ్మాస్త్ర’ తొలి పార్ట్‌ను వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని గతంలో చిత్రబృందం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment