‘నా డ్రీమ్‌ 18న చూడబోతున్నారు’ | Ashwin And Omkar Speech At Raju Gari Gadhi 3 Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

‘త‌మ్ముడు స‌క్సెస్ అయితే నేను డ్రస్సింగ్ మార్చుకుంటా’

Published Wed, Oct 16 2019 5:21 PM | Last Updated on Wed, Oct 16 2019 5:30 PM

Ashwin And Omkar Speech At Raju Gari Gadhi 3 Movie Pre Release Event - Sakshi

బుల్లితెరపై సత్తా చాటిన ఓంకార్‌ తరువాత రాజుగారి గది సినిమాతో వెండితెర మీద కూడా దర్శకుడిగా సక్సెస్‌ అయ్యాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఏకంగా నాగార్జున, సమంత లాంటి స్టార్స్‌తో రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా రిజల్ట్‌ బెడసి కొట్టింది. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని తన తమ్ముడు అశ్విన్‌ హీరోగా ‘రాజుగారి గది 3’ చిత్రాన్ని ఓంకార్‌ తెరకెక్కించాడు.  ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అవికాగోర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘యూ/ఏ’ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. ఈ నెల 18న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను బుధవారం ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు.       

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఓంకార్ మాట్లాడుతూ.. ‘18న విడుద‌లవుతున్న ఈ చిత్రం చిన్న పిల్ల‌ల‌తో స‌హా అంద‌రూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అశ్విన్, క‌ళ్యాణ్  నా త‌మ్ముళ్ళు ఇద్దరూ న‌న్ను న‌మ్ముకుని నాతో ఉంటూ న‌న్ను స‌పోర్ట్ చేస్తూ చాలా హెల్ప్‌ చేశారు. నేను ఎప్పుడూ అశ్విన్‌ని హీరోని చెయ్యాల‌ని, క‌ళ్యాణ్‌ని ప్రొడ్యూస‌ర్ చేయాల‌న్న‌ది నా కోరిక‌. 18న అశ్విన్ హీరోగా మీ ముందుకు వ‌స్తాడు. ఇక క‌ళ్యాణ్ బాధ్య‌త ఒక‌టి ఉంది.  మీరందరూ మ‌మ్మ‌ల్ని త‌ప్ప‌కుండా స‌పోర్ట్ చేస్తార‌ని కోరుకుంటున్నాను. నాన్న‌గారూ లాస్ట్ ఇయ‌ర్ చ‌నిపోయారు. అప్ప‌టి నుంచి నేను వైట్ డ్ర‌స్‌లో ఉంటున్నాను. త‌మ్ముళ్ళ‌ని సక్సెస్‌ చేసిన త‌ర్వాతే డ్రసింగ్‌ మార్చుకుంటాను. న‌న్ను ఆద‌రించిన‌ట్లే నా త‌మ్ముడు అశ్విన్‌ని రిసీవ్ చేసుకుంటార‌ని భావిస్తున్నాను’అని ఓంకార్‌ అన్నారు.  

‘నా డ్రీమ్ 18న‌ చూడ‌బోతున్నారు. జీనియ‌స్ నుంచి నేను ఒక ఐదు చిత్రాల్లో చేశాను. కానీ చోటా గారి లాంటి పెద్ద టెక్నీషియ‌న్‌తో పని చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా జూన్ 21న మొద‌లై  ఇంత త్వ‌ర‌గా పూర్త‌వ‌డానికి  మొయిన్ కార‌ణం కాస్ట్ అండ్ క్రూ ఎవ్వ‌రూ మ‌మ్మల్ని ఇబ్బంది పెట్ట‌లేదు. అంద‌రూ ఇష్ట‌ప‌డి మ‌మ్మ‌ల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను’అని అశ్విన్‌ బాబు పేర్కొన్నారు. హీరోయిన్‌ అవికాగోర్ మాట్లాడుతూ..‘మొద‌టిసారి నేను చాలా నెర్వ‌స్‌గా ఫీలవుతున్నాను.  ఎందుకంటే ఈ చిత్రం  నాకు చాలా స్పెష‌ల్‌. ‘రాజుగారి గది3’ చిత్ర యూనిట్‌ను నా ఫ్యామిలీగా భావిస్తున్నాను. ఈ క్యారెక్ట‌ర్‌ని ఆడియ‌న్స్ ఎలా ఆద‌రిస్తారా అని వెయిట్ చేస్తున్నాను. చోటాగారు, ఓంకార్‌ బ్ర‌ద‌ర్స్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు’అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement