రాజుగారి గదిలోకి మూడోసారి! | Tamannaah and Director Ohmkar Raaju Gari Gadhi 3 Launch | Sakshi
Sakshi News home page

రాజుగారి గదిలోకి మూడోసారి!

Published Thu, Jun 20 2019 10:24 AM | Last Updated on Thu, Jun 20 2019 10:24 AM

Tamannaah and Director Ohmkar Raaju Gari Gadhi 3 Launch - Sakshi

బుల్లితెర నుంచి వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయిన ఓంకార్‌ రాజుగారి గది సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. దీంతో అదే జానర్‌లో నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో రాజుగారి గది 2 చిత్రాన్ని తెరకెక్కించిన మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అదే ట్రెండ్‌ ను కంటిన్యూ చేస్తూ రాజుగారి గది 3ని తెరకెక్కిస్తున్నాడు ఓంకార్‌.

వరుసగా హారర్‌ చిత్రాలతో సత్తా చాటుతున్న తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుతో స్టార్‌ మా బిజినెస్‌ హెడ్‌ అలోక్‌ జైన్‌లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. అశ్విన్‌ బాబు హీరోగా నటిస్తున్న ఈసినిమాలో ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓంకార్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement