'నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నా'.. హీరో అశ్విన్ కన్నీటి పర్యంతం! | Ashwin Babu Full Emotional About Brother Omkar Show Promo | Sakshi
Sakshi News home page

Ashwin Babu: 'ఇప్పటి వరకు అన్నీ నువ్వే'.. ఏడ్చేసిన హీరో అశ్విన్!

Published Tue, May 30 2023 9:10 PM | Last Updated on Wed, May 31 2023 8:14 AM

Ashwin Babu Full Emotional About Brother Omkar Show Promo - Sakshi

టాలీవుడ్‌లో యంగ్ హీరో అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజు గారి గది సిరీస్‌తో అభిమానులను మెప్పించారు. ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్‌ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. జీనియస్ అనే సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలో మెప్పించారు ఆయన నటించిన రాజుగారి గది సిరీస్‌ సూపర్ హిట్‌గా నిలిచింది. రాజు గారి గది  సిరీస్ చిత్రాలకు అతడి అన్నయ్యే దర్శకుడు కావడం విశేషం.

(ఇది చదవండి: హీరోయిన్లందరినీ ట్రై చేశా.. జేడీ చక్రవర్తి బోల్డ్‌ కామెంట్స్‌

హిడింబ చిత్రం మరోసారి అభిమానులను పలకరించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర బృందం ఓంకార్ యాంకర్‌గా హోస్ట్ చేస్తున్న సిక్త్ సెన్స్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. అశ్విన్‌తో పాటు హీరోయిన్ నందితా శ్వేత, విద్యుల్లేఖా రామన్ కూడా వచ్చారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.

అయితే ఈ షోలో పాల్గొన్న తమ్ముడిని చూసి ఓంకార్ ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారి తమ్ముడితో సిక్త్ సెన్స్ షో ఆడుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ షోలో పాల్గొన్న వారిని ప్రశ్నించిన ఓంకార్.. తన తమ్ముడికి కూడా ఓ ప్రశ్న వేశాడు. నీ జీవితంలో ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉందా అని అడిగాడు.

(ఇది చదవండి: ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి.. దీని వెనుక ఇంత కథ ఉందా..!)

ఈ ప్రశ్నకు అశ్విన్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. 'ఇ‍ప్పటివరకు నాకు అన్నీ నువ్వే. నేను ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నా అన్నయ్యా. నిన్ను అడగాలంటే కన్నీళ్లు ఆగడం లేదంటూ' కన్నీటి పర్యంతమయ్యాడు. తమ్ముడిని చూసిన అన్నయ్య కూడా ఫుల్ ఎమోషనల్‌గా కనిపించారు. వీరు మొత్తం ముగ్గురు అన్నదమ్ముులు కాగా.. చిన్నతమ్ముడు నిర్మాణరంగంలో రాణిస్తున్నారు. తన తమ్ముళ్ల కోసం ఓంకార్ ఎంత ఈ ప్రోమో చూస్తే  అర్థమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement