నాగ్ జోడిగా సీరత్ | Seerat Kapoor to romance Nagarjuna in Raju gari Gadi 2 | Sakshi
Sakshi News home page

నాగ్ జోడిగా సీరత్

Published Wed, Nov 30 2016 10:52 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగ్ జోడిగా సీరత్ - Sakshi

నాగ్ జోడిగా సీరత్

సీనియర్ హీరోలందరూ హీరోయిన్లు దొరక్క ఇబ్బందులు పడుతుంటే కింగ్ నాగార్జున మాత్రం వరుసగా కుర్రభామలతో సినిమాలు చేసేస్తున్నాడు. రమ్యకృష్ణ లాంటి సీనియర్ హీరోయిన్లతో జత కడుతూనే లావణ్య త్రిపాఠి, ప్రగ్యా జైస్వాల్ లాంటి కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. తాజాగా మరో యంగ్ హీరోయిన్, నాగ్కు జోడిగా నటించేందుకు అంగీకరించింది. ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమోవేంకటేశాయ సినిమాలో నటిస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా తరువాత రాజుగారి గది ఫేం ఓంకార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు రాజుగారి గది 2 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో నాగార్జున సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. అయితే ఒక హీరోయిన్గా రన్ రాజా రన్, టైగర్ లాంటి సినిమాల్లో నటించిన సీరత్ కపూర్ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ లాంటి యంగ్ హీరోతో నటించిన బ్యూటి నాగ్తో జోడి కట్టేందుకు ఏమాత్రం ఆలోచించకుండా ఓకె చెప్పేసిందట. త్వరలో మరో హీరోయిన్ను ఫైనల్ చేయనున్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement