Viral: Serious Argument Between Mumaith Khan And Omkar In Dance Show - Sakshi
Sakshi News home page

ముమైత్‌ఖాన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన ఓంకార్‌

Published Sat, Apr 10 2021 2:15 PM | Last Updated on Sat, Apr 10 2021 5:11 PM

Omkar Vs Mumaith Khan In A Heated Argument Promo Out - Sakshi

బుల్లితెరపై యాంకర్‌గా ఓంకార్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తనదైన స్టైల్‌తో షో టీఆర్పీ రేటింగ్స్‌ పెంచడంలో ఓంకార్‌ ముందుంటారు.  ప్రస్తుతం ఓ బుల్లితెరపై ప్రసారం అయ్యే డ్యాన్స్‌ షోకు ఓంకార్‌ హోస్ట్‌గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఓ  గొడవలో షో జడ్జిగా వ్యవహరిస్తున్న ముమైత్‌ ఖాన్‌కు ఓంకార్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్‌ అయ్యంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలు ఏమైందంటే..జడ్జిమెంట్‌ టైంలో ఓ కంటెస్టెంట్‌కు, ముమైత్‌ ఖాన్‌కు గొడవ జరుగుతుంది. దీంతో కంటెస్టెంట్‌ పైకి ముమైత్‌ గట్టిగా అరుస్తుండటంతో ఎందుకు సీరియస్‌ అవుతున్నారు అంటూ ఓంకార్‌ ఆమెను కూల్‌ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ముమైత్‌ తగ్గకపోగా, ఓంకార్‌పై కూడా వేలు చూపిస్తూ తన కోపాన్ని ప్రదర్శించింది. ఈ సంఘటనతో సీరియస్‌ అయిన ఓంకార్‌..మీరు మీరు గొడవపడుతున్నప్పుడు నన్నెందుకు పాయింటౌట్‌ చేస్తున్నారు అంటూ  సీరియస్‌ అయ్యాడు. ఈ షాకింగ్‌ ఇన్సిడెంట్‌తో ఏం చెయ్యాలో తెలియక ముమైత్‌ సైలంట్‌ అయిపోతుంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ కావాల్సి ఉంది. అయితే  ఈ ప్రోమోపై సోషల్‌ మీడియాలో పలు మీమ్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. 

చదవండి : అందరు చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్‌!
ప్రముఖ డ్యాన్స్‌ షోలో ప్రమాదం..కంటెస్టెంట్‌కు తీవ్ర గాయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement