Ramya Krishna Introduces As Judge With Dance Icon Show In AHA OTT - Sakshi
Sakshi News home page

Ramya Krishna: ఓటీటీలోకి రమ్యకృష్ణ అరంగేట్రం, ఆ డాన్స్‌ షోలో ‘శివగామి’ సందడే సందడి..

Published Mon, Sep 12 2022 8:23 PM | Last Updated on Mon, Sep 12 2022 8:35 PM

Ramya Krishna Introduces As Judge With Dance Icon Show In AHA OTT - Sakshi

ప్రేక్షకులకు వందశాతం వినోదం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా. ప్రేక్షకులు వందశాతం వినోదం అందించేందుకు ఆహా సరికొత్త కథలు, షోలతో ముందుకు వస్తోంది. అన్‌స్టాపబుల్‌ టాక్‌ షో విత్‌ ఎన్‌బీకే, తెలుగు ఇండియన్‌ ఐడల్‌ వంటి రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరించిన ఆహా తాజాగా డాన్స్‌ ఐకాన్‌ షోతో సిద్ధమైంది. ఆహా ప్లాట్‌ఫాంపై తాజాగా గ్రాండ్‌గా లాంచ్‌ అయిన ఈ షోతో లేడీ సూపర్‌ స్టార్‌, ‘శివగామి’ రమ్యకృష్ణ డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టింది.

చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?

ప్రముఖ యాంకర్‌ ఓంకార్‌ హొస్ట్‌గా చేయనున్న ఈ షోకి ఆమె జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు కింగ్‌ ఆఫ్‌ హుక్‌ స్టెప్స్‌ శేఖర్‌ మాస్టర్‌ కూడా న్యాయనిర్ణేతగా ఉండబోతున్నాడు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా అరంగేట్రం చేస్తుండడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక ఫార్మాట్ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చేయనిది. ఈ షో ద్వారా ఎవరూ చూడని ఒక కొత్త రమ్యని చూడబోతున్నారు. అందరూ ఈ షో ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు.

చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే..

అదే విధంగా ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్‌తో ఆహా ఫ్యామిలీకి రమ్యకృష్ణని మేము స్వాగతిస్తున్నాము. రమ్య ఎంతో మందికి ఒక రోల్ మోడల్. డ్యాన్స్‌పై ఆమెకున్న అవగాహన అసమానమైనది. డాన్స్ ఐకాన్‌కు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. అనంతరం యాంకర్‌, ఈ షో ప్రొడ్యూసర్‌ ఓంకార్ “రమ్యకృష్ణ గారు ఈ షో కి జడ్జి గా వ్యవహరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రమ్య గారితో పనిచేయాలి అనే నా కల, ఆహ టీం ద్వారా సాకరమైంది. డాన్స్ ఐకాన్ షో ద్వారా అందరికీ నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది’ అని తెలిపారు. ఈ షో సెప్టెంబర్ 17 నుండి ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ఆహాలో అందుబాటులో ఉండనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement