
ఓంకార్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ డ్యాన్స్ షో డ్యాన్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ పేరుకు తగినట్లే రోజు రోజుకూ హీటెక్కుతోంది. సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో కార్యక్రమం మరింత ఉత్కంఠగా మారింది. టాప్ ప్లేస్ కోసం ఎవరు పోటీ పడతారు అనేది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి పేర్లతో పంచభూతాల్లాంటి ఐదుగురు కంటెస్టెంట్స్ విపుల్ కాండ్పాల్, సాధ్వి మజుందార్, బినితా చెట్రీ, షోనాలి మరియు బర్కత్ అరోరా తమ పర్ ఫార్మెన్స్ లు ఆకట్టుకుంటుండగా..వీరికి ఐదుగురు మెంటార్స్ గా మానస్, దీపిక, జాను లైరి, ప్రకృతి, యష్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు.
డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ ఉత్కంఠ కలిగిస్తూ సాగాయి. టీమ్ ఎర్త్ మెంటార్ ప్రకృతి కంబం.. మానస్ నాగులపల్లి టీమ్ 'ఫైర్' ని నామినేట్ చేసింది. రివేంజ్ గా ప్రకృతి మెంటార్ గా ఉన్న ఎర్త్ ని మానస్ నామినేట్ చేయడం హీట్ పెంచింది. యష్ మాస్టర్, దీపికా జానులైరి 'వాటర్' ను నామినేట్ చేయగా, ప్రతీకారంగా జనులైరి, దీపిక 'ఎయిర్' ను నామినేట్ చేసింది. యశ్ మాస్టర్ 'స్కై' మాత్రం నామినేషన్స్ నుంచి బయటపడింది. ఈ నామినేషన్స్ ప్రక్రియ రాబోయే రోజుల్లో డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ మరింత సస్పెన్స్ గా ఉండబోతున్నట్లు హింట్ ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment