ప్రేమ అంటే ఓ మ్యాజిక్. ఆ మ్యాజిక్‌తో స్టార్ మా "ఇస్మార్ట్ జోడి సీజన్ 3"ని ప్రారంభిస్తోంది. గత రెండు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యాంకర్ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ షోలో సెలబ్రిటీ జంటల మధ్య అనుబంధానికి, అన్యోన్యతకు, అనురాగానికి కావాల్సినంత వినోదాన్ని జోడించనున్నారు.
ఈ షోలో ప్రదీప్- సరస్వతి, అనిల్ జీలా- ఆమని, అలీ రెజా- మసుమా, రాకేష్- సుజాత, వరుణ్- సౌజన్య, యష్- సోనియా, మంజునాథ- లాస్య, ఆదిరెడ్డి- కవిత, అమర్ దీప్- తేజు జంటలు పాల్గొంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్నవారు, కొంత జీవితం చూసినవారు, సలహాలు సూచనలు ఇచ్చే స్థాయి అందుకున్నవారు అంద ఉన్నారు.
ఈ షో వినోదంతో అలరించడమే కాదు, ఆలోచింపచేస్తుంది. జంటలు మరింత ప్రేమగా ఉండేందుకు పరోక్షంగా సలహాలిస్తుంది. బంధం బలంగా ఉండడానికి ఏం చేయాలో సూచనలిస్తుంది. స్టార్ మా లో ఈ శనివారం(డిసెంబర్ 21) రాత్రి 9 గంటలకు ఇస్మార్ట్ జోడి సీజన్ 3 ప్రారంభం కానుంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment