
ఓంకార్ యాంకర్‌గా బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన డ్యాన్స్ రియాలిటీ షో ఆట. ఈ షో మొదటి సీజన్ విన్నర్ టీనా మృతి చెందింది. ఈ విషయాన్ని ఆట సందీప్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. టీనా సాధు మరణవార్త తెలిసి షాక్ అయ్యాను. ఆట సీజన్‌లో నా పార్టనర్ అయిన టీనా మరణవార్త చాలా బాధిస్తుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. టీనా ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఆట సందీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఇది చూసిన నెటిజన్లు టీనా మరణవార్త తెలిసి షాక్ అవుతున్నారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆట సీజన్-1విన్నర్‌గా నిలిచిన టీనా ఆ తర్వాత సీజన్-4కి జడ్జిగా వ్యవహరించారు. అయితే కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా ఇలా హఠాన్మరణం చెందడం షాకింగ్‌గా అనిపిస్తుంది. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment