
ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్ విన్నర్ టీనా సాధు మరణం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఎంతో ఫిట్‌గా ఉండే టీనా 38ఏళ్ల వయసులోనే మరణించడంతో ఆమె మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టీనా మరణంపై ఆట సందీప్ అనుమానం వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు షాకింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.
'టీనా లేదన్న విషయం ఇంకా నమ్మబుద్ది కావట్లేదు. 5రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఎంతో సరదాగా గడిపిన టీనాకు అంత సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఆమె చాలా ఫిట్‌గా ఉంటుంది. ఇది గుండెపోటు అయ్యిండదనిపిస్తుంది. నాతో మాట్లాడినప్పుడు డిప్రెషన్‌లో ఉన్నాను. పర్సనల్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పింది.
కలిసినప్పుడు వీటిపై మాట్లాడతానని చెప్పింది. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది' అని పేర్కొన్నారు. దీంతో టీనా మృతిపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఆట సీజన్-1లో సందీప్-టీనాల జోడి టైటిల్ విన్నర్‌గా గెలిచిన సంగతి తెలిసిందే.
చదవండి: ఆట' డ్యాన్స్ షో విన్నర్ టీనా కన్నుమూత
చదవండి: డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతిపై అనుమానాలు, లిక్కర్ ఎక్కువవడం వల్లే..
Comments
Please login to add a commentAdd a comment