
నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాన్షన్ 24. అవికా గోర్, సత్యరాజ్, బిందు మాధవి, రాజీవ్ కనకాల, రావు రమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. 'జాతీయ సంపదను దోచుకున్న కాళిదాసు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు' అన్న హెడ్‌లైన్‌తో ట్రైలర్ మొదలైంది.
అయితే తాను దేశద్రోహి కూతుర్ని కాదని, నిజాయితీపరుడైన కాళిదాసు కూతుర్ని, దాన్ని నిరూపిస్తానంటూ సీన్‌లోకి ఎంటరైంది వరలక్ష్మి శరత్‌కుమార్. కనిపించకుండా పోయిన తండ్రి కోసం, అతడి మీద వేసిన దేశద్రోహి అనే నిందను తొలగించేందుకు తనే స్వయంగా రంగంలోకి దిగుతుంది. తండ్రి కోసం వెతుకులాట మొదలుపెడుతుంది. ఈ క్రమంలో అతడి తండ్రి చివరిసారిగా ఓ కోటకు వెళ్లినట్లు తెలుసుకుంటుంది. అక్కడికి వెళ్లినవారెవరూ తిరిగి రాలేదని అందరూ చెప్తూ ఉంటారు.
అయినా సరే, తన తండ్రి ఏమయ్యాడో తెలుసుకోవాలని పాడుబడ్డ మాన్షన్‌లోకి అడుగుపెడుతుంది. అక్కడ వరలక్ష్మికి ఎదురైన పరిణామాలేంటి? తన తండ్రి నిజాయితీపరుడా? దేశద్రోహా? వరలక్ష్మి అక్కడి నుంచి తిరిగి ప్రాణాలతో బయటపడిందా? వంటి విషయాలు తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 17 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.
చదవండి: సీక్రెట్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్‌మెంట్? ఎవరా మిస్టరీ మ్యాన్?
Comments
Please login to add a commentAdd a comment