
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జేడీ చక్రవర్తి. మనీ మనీ , గులాబీ , బొంబాయి ప్రియుడు వంటి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన జేడీ చక్రవర్తి ప్రస్తుతం హాట్ స్టార్‌లో ఓ ఒరిజినల్‌లో నటిస్తున్నారు.
ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఓంకార్ హోస్ట్‌గా చేస్తున్న ఓ షోకు జేడీ, ఈషా రెబ్బా హాజరై సందడి చేశారు. చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో ధనుష్.. షాకింగ్ లుక్
ఈ సందర్భంగా మీ కెరీర్‌లో ఏ హీరోయిన్‌ని అయినా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారా అని ఓంకార్ ప్రశ్నించగా జేడీ చక్రవర్తి అంతే బోల్డ్‌గా సమాధానం ఇచ్చారు. మా నాన్న మీద ఒట్టు అందరు హీరోయిన్లని ట్రై చేశా అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment