
ఇలాంటి కాన్సెప్ట్ ఈజీ కాదు
- ఓంకార్
ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఓంకార్ నిర్మించిన చిత్రం ‘రాజుగారి గది’. అశ్విన్, చేతన్, ధన్యా బాలకృష్ణన్, పూర్ణ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రం విజయోత్సవం మంగళవారం జరిగింది. ఓంకార్ మాట్లాడుతూ - ‘‘అవయవదానం గొప్పదనం చెప్పే సినిమా తీయడమంటే అంత ఈజీ కాదు. ఆ విషయంలో నిమ్మగడ్డ ప్రసాద్ గారు హెల్ప్ చేశారు. సాయి కొర్రపాటి, అనిల్ సుంకర అందించిన సపోర్ట్‌తో దసరా కానుకగా విడుదల చేసి, మంచి విజయం సాధించాం’’ అని చెప్పారు.
‘‘ఇది నా సెకండ్ హారర్ మూవీ’’ అని పూర్ణ అన్నారు. ‘‘టీమ్ అందరం బాగా కష్టపడ్డాం. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసి నాకు లైఫ్ ఇచ్చారు’’ అని హీరో అశ్విన్ చెప్పారు. నిర్మాత సాయి కొర్రపాటి, సంగీత దర్శకుడు సాయికార్తీక్, చిత్ర కథానాయిక ధన్యా బాలకృష్ణన్, నటులు చేతన్, ధన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.