ఆర్జీజీ2 లో నాగ్ రోల్ రివీల్ | Nagarjuna as mentalist in 'Raju Gari Gadhi 2' | Sakshi
Sakshi News home page

ఆర్జీజీ2 లో నాగ్ రోల్ రివీల్

Published Wed, Feb 15 2017 7:58 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

ఆర్జీజీ2 లో నాగ్ రోల్ రివీల్ - Sakshi

ఆర్జీజీ2 లో నాగ్ రోల్ రివీల్

గత ఏడాది రిలీజ్ అయిన ఓంకార్ సినిమా రాజుగారి గది సూపర్ హిట్ అయ్యింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా రాజుగారి గది 2 తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఓంకార్ ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు . ఫిబ్రవరి 17 నుండి సెట్స్ పైకి రానున్న రాజుగారి గది 2 ఫస్ట్ పేజ్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి రెడీ అయిపోయింది. హీరోగా 30 ఏళ్ల కెరీర్‌లో పలు వైవిధ్యమైన సినిమాలు చేసిన నాగార్జున, తొలిసారి హారర్ కమ్ థ్రిల్లర్ ‘రాజుగారి గది-2’లో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.
 
అయితే ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ పై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. ఇందులో నాగ్‌ విల‍క్షణంగా ఉండే గెటప్‌ తో కనిపించనున్నారు. నాగ్ డ్రెస్సింగ్ నుంచి లుక్స్ వరకు అన్నీ ట్రెండీగా ఉంటాయట. ఓ ఫ్యాన్సీ బైక్‌ పై హల్‌చల్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తాడని సమాచారం. నాగ్‌ ఈ సినిమాలో మెంటలిస్ట్‌గా కనిపించబోతున్నారు. అతీంద్రియ శక్తులు కలిగి.. ఎదుటి వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తనతో ఓ ఆట ఆడుకుంటాడట.
 
కాగా ఈ చిత్రంలో సమంతా ఓ కీ రోల్‌ లో నటించనుంది. అయితే నాగార్జున, సమంతా జంటగా నటిస్తున్నారనే వార్తల్లో నిజం లేదంటున్నారు చిత్ర యూనిట్‌. వారిద్దరివి వేరు వేరు పాత్రలని, అదేవిధంగా అందరు అనుకుంటున్నట్టు సమంతా ఘోస్ట్‌ గా కూడా నటించడం లేదని తేలింది. చాలా ఎమోషనల్‌ రోల్‌ లో ఆమె ప్రేక్షకులను అలరించునుందట. ఇంతకు ముందు రాజు గారి గదిలో హీరోగా చేసిన ఓంకార్ తమ్ముడు అశ్విన్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. సీరత్‌ కపూర్‌  ఒక హీరోయిన్‌ చేస్తోంది.  పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement