Shiva Shankar Master Health: Siva Shankar Master Affected With Coronavirus And He Is In Critical Condition - Sakshi
Sakshi News home page

Siva Shankar Master: విషమంగా శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం, సాయం కోసం ఎదురుచూపు!

Published Thu, Nov 25 2021 12:53 AM | Last Updated on Thu, Nov 25 2021 8:58 AM

Siva Shankar Master Affected With Coronavirus And He Is In Critical Condition - Sakshi

Siva Shankar Master Health Condition Critical: కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇటీవలే ఆయనకు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది ఆ కుటుంబం.

శివ శంకర్‌ మాస్టర్‌ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్‌ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్‌ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటుడిగానూ అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్‌ షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement