ఏసీబీకి చిక్కిన అకౌంట్స్‌ ఆఫీసర్‌ | accounts officer catched by ACB | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన అకౌంట్స్‌ ఆఫీసర్‌

Published Thu, Jul 13 2017 4:56 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

accounts officer catched by ACB

విజయవాడ: విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారి ఒకరు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శివశంకర్ ఓ కాంట్రాక్టర్‌కు చెందిన రూ.38 లక్షల బిల్లును మంజూరు చేసేందుకు రూ.50 వేలు డిమాండు చేశాడు. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

వారి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం ఆ అధికారికి ఆయన చాంబర్‌లోనే రూ.50వేలు ఇస్తుండగా మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో రాజమహేంద్రవరం కార్పొరేషన్ లో పనిచేస్తున్న సమయంలో ఇదే తరహాలో శివశంకర్ పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement