సునీత దంపతులకు హైకోర్టులో ఎదురు దెబ్బ
క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు
సిబిఐ అధికారి రాంసింగ్ పిటిషన్ కూడా డిస్మిస్
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సునీత, సీబీఐ అధికారి రాంసింగ్‌కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. వీరు వేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.
కేసు పూర్వపరాలేంటీ?
మాజీ మంత్రి వివేకానంద రెడ్డికి పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి 2021 డిసెంబర్‌లో పులివెందుల కోర్టులో ఒక ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి కొందరు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి పేర్లు చెప్పాలంటూ సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ ఒత్తిడి చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ ఒత్తిడి చేశారని ఆరోపించారు. కృష్ణా రెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు 2023 డిసెంబర్ 8న విచారణ జరిపింది. కేసు నమోదు చేసి తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీత, రాంసింగ్‌పై కేసులు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ సునీత, ఆమె భర్త రాజశేఖర్, ఎస్పీ రామ్‌సింగ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
హైకోర్టు ఏం చెప్పింది?
వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పెట్టిన కేసును కొట్టేయాలన్న సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ వాదనలను ఏపీ హైకోర్టు అంగీకరించలేదు. వీరు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
చదవండి : నర్రెడ్డి సునీత, రాజశేఖర్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
కృష్ణారెడ్డి ఏం చెబుతున్నారు?
"వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత దంపతుల పాత్ర అనుమానస్పదంగా ఉంది. ఈ హత్య సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కుట్ర అని భావిస్తున్నాను. వారిద్దరితోపాటు శివప్రకాశ్‌రెడ్డిల తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా రెండో పెళ్లితోనే ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలని వివేకానందరెడ్డి భావించడంతో హత్య జరిగినట్టు భావిస్తున్నాను. వివేకా లెటర్‌ను దాచిపెట్టమని ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి స్వయంగా చెప్పారు. ఆ తర్వాత కూడా అబద్ధం చెప్పాలని సునీత, రాజశేఖర్‌రెడ్డి నన్ను వేధించారు. ఈ హత్యకు కారణం ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని నాపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు, సీబీఐ అధికారులు చిత్రహింసలకు గురిచేశారు. నేను అబద్ధం చెప్పకపోతే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందని సునీత అన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడం వెనుక పక్కా కుట్ర ఉంది. అవినాశ్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడం కోసం చివరి వరకూ వివేకా కృషి చేశారు" అని వివేకా పీఏ కృష్ణారెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment