kamineni srinivas rao
-
‘రహస్య భేటీ సూత్రధారి చంద్రబాబే’
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి రహస్యంగా భేటీ కావడంపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ముగ్గురు కలిసి ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ రహస్య భేటీకి చంద్రబాబు నాయుడే సూత్రధారి అని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ దుర్మార్గపు మనస్తత్వం ఈ భేటీతో బయటపడిందన్నారు. (చదవండి : ఇద్దరు నేతలతో నిమ్మగడ్డ రహస్య భేటీ) తప్పుడు పనులు చేస్తున్న నిమ్మగడ్డ తక్షణమే అరెస్టు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సుజనా, కామినేని బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని విమర్శించారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంతో చంద్రబాబు ఎక్స్పర్ట్ అని, వాడుకొని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, నిమ్మగడ్డ కలిసి ప్రభుత్వంకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థల్లోకి సొంత మనుషులను చొప్పించడం, ఆవ్యవస్థలను అనైతికంగా వాడుకోవడం చంద్రబాబకు బాగా అలవాటైందని మండిపడ్డారు. టీడీపీ నుంచి వచ్చిన లేఖపై నిమ్మగడ్డ రమేష్ సంతకం చేశారని ఆరోపించారు. హోటల్ భేటీలో ముగ్గురు కలిసి ఎవరితో మాట్లాడారో తెలపాలని డిమాండ్ చేశారు. ఈ ముగ్గురు నేతల భేటీపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. నిమ్మగడ్డ బండారం బయట పెట్టేందుకు ఎంత దూరమైన వెళ్తామని అంబటి పేర్కొన్నారు. (చదవండి : నిమ్మగడ్డతో భేటీ: బీజేపీ నేతలపై అధిష్టానం ఫైర్ ) -
ఎంత ఘాటు ప్రేమయో!
అక్కడ కత్తులు, ఇక్కడ కౌగలింతలు.. అక్కడ విసవిసలు, ఇక్కడ పకపకలు.. జాతీయ స్థాయిలో టీడీపీ, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.. కానీ నర్సీపట్నంలో కనిపించిన దృశ్యం అందుకు భిన్నం. ఇక్కడ ఆదివారం జరిగిన కార్యక్రమం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. పైకి వైరం నటిస్తూ.. లోన స్నేహబంధాన్ని కొనసాగిస్తున్న రాజకీయ నాటకమా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రం ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు హల్చల్ చేశారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా మాజీ మంత్రి చేత ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభింప చేశారు. విశాఖపట్నం, నర్సీపట్నం: ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాన్ని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.. మాజీమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావుచే ప్రారంభింపజేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రొటోకాల్‌ను పక్కన పెట్టిమరీ ప్రారంభోత్సవాన్ని ఓ మాజీ మంత్రిచే చేయించడం ఆసక్తికరంగా మారింది. ఇదంతా ఒక ఎత్తయితే ఆ మాజీ మంత్రి వైద్యశాఖ అధికారులకు సూచనలిస్తూ.. సర్కారు లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా వైద్యశాఖాధికారికి ఉద్బోధించడంతో అక్కడున్నవారు నివ్వెరపోయారు. బీజేపీ, టీడీపీల మధ్య వైరం కేవలం మాటల వరకేననీ, తెరవెనుక రెండు పార్టీల మధ్య సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉందనడానికి ఇదే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, కామినేని బీజేపీని వీడి పచ్చ కండువా కప్పుకోవాలనుకుంటున్నారన్న వార్తలకు ఈ ఘటన బలాన్నిచ్చినట్లయిందని మరికొందరంటున్నారు. -
'సెల్‌ఫోన్ వెలుగులో ఆపరేషన్ వాస్తవమే’
సాక్షి, గుంటూరు : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌ని సందర్శించారు. ఓ పేషెంట్‌కు సెల్ ఫోన్ వెలుగులో ఆపరేషన్ నిర్వహించిన విషయం వెలుగులోకి వచ్చిన తెలిసిందే. ఈ నేపథ్యంలో కామినేని జీజీహెచ్‌లో తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ నిర్వహించిన థియేటర్‌ను పరిశీలించి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ 'సెల్‌ఫోన్ వెలుగులో ఆపరేషన్ జరగడం వాస్తవమే. ఆపరేషన్ నిర్వహించిన రోజు నాలుగుసార్లు కరెంటు పోవడంతో అంతరాయం ఏర్పడింది. దీంతో డాక్టర్లు సెల్‌ఫోన్ వెలుగులో శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఈ సంఘటనపై డీఎంఈను విచారణ అధికారిగా నియమించాం. ఆపరేషన్ థియేటర్లను రూ. 30 లక్షలతో ఆధునీకరించాం. అన్నీ థియేటర్లు బాగున్నాయి. డీఎంఈ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం' అని తెలిపారు. -
'మా చేతుల్లో ఏమీ లేదు.. '
సాక్షి, అమరావతి : ఫాతిమా కాలేజ్ విషయంలో సాంకేతికంగా ఉన్న ఇబ్బందులు అధిగమించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. సీఎంను కలిసేందుకు సోమవారం అసెంబ్లీకి వచ్చిన ఫాతిమా కాలేజ్ విద్యార్థులు అసెంబ్లీ లాబీల్లో మంత్రి కామినేనిని కలుసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన విద్యార్థులకు వివరించారు. తమ చేతుల్లో ఏమీ లేదని, అన్ని ప్రయత్నాలు చేశామని కామినేని చెప్పారు. కాలేజీ మోసంపై సీఐడీ విచారణ జరుపుతామన్నారు. ప్రభుత్వం చాలా చేసింది.. ప్రత్యేకంగా లాయర్ ను పెట్టింది అని కూడా వివరించారు. -
మెడికల్ ఫీజుల్లో పెంపు లేదు: కామినేని
హైదరాబాద్: ఈ ఏడాది మెడికల్ ఫీజులు పెంచబోమని ఆంధ్రప్రదేశ్ మంత్రి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది ఫీజులే కొనసాగిస్తున్నామని చెప్పారు. ఎంబీబీఎస్ ఫీజులపై వచ్చే నెల మొదటివారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర విభజనతో కోల్పోయిన 350 మెడికల్ సీట్ల కోసం కేంద్రం ద్వారా కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. మరోపక్క రాష్ట్రానికి 450 మెడికల్ సీట్లు వచ్చాయని, వీటిలో తిరుపతిలోని పద్మావతి మెడికల్ కాలేజీలో కేవలం మహిళలకే 150 సీట్లు కేటాయించారని చెప్పారు. మెడికల్ కౌన్సెలింగ్ లో గత ఏడాది విధానాన్నే అవలంభించనున్నామని వెల్లడించారు. మంత్రిగా కామినేని శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు.