సాక్షి, గుంటూరు : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌ని సందర్శించారు. ఓ పేషెంట్‌కు సెల్ ఫోన్ వెలుగులో ఆపరేషన్ నిర్వహించిన విషయం వెలుగులోకి వచ్చిన తెలిసిందే. ఈ నేపథ్యంలో కామినేని జీజీహెచ్‌లో తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ నిర్వహించిన థియేటర్‌ను పరిశీలించి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ 'సెల్‌ఫోన్ వెలుగులో ఆపరేషన్ జరగడం వాస్తవమే. ఆపరేషన్ నిర్వహించిన రోజు నాలుగుసార్లు కరెంటు పోవడంతో అంతరాయం ఏర్పడింది. దీంతో డాక్టర్లు సెల్‌ఫోన్ వెలుగులో శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఈ సంఘటనపై డీఎంఈను విచారణ అధికారిగా నియమించాం. ఆపరేషన్ థియేటర్లను రూ. 30 లక్షలతో ఆధునీకరించాం. అన్నీ థియేటర్లు బాగున్నాయి. డీఎంఈ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం' అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment