మెడికల్ ఫీజుల్లో పెంపు లేదు: కామినేని | no hike in medical fees, says kamineni srinivas rao | Sakshi
Sakshi News home page

మెడికల్ ఫీజుల్లో పెంపు లేదు: కామినేని

Published Fri, Jun 20 2014 1:20 PM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM

మెడికల్ ఫీజుల్లో పెంపు లేదు: కామినేని - Sakshi

మెడికల్ ఫీజుల్లో పెంపు లేదు: కామినేని

హైదరాబాద్: ఈ ఏడాది మెడికల్ ఫీజులు పెంచబోమని ఆంధ్రప్రదేశ్ మంత్రి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది ఫీజులే కొనసాగిస్తున్నామని చెప్పారు. ఎంబీబీఎస్ ఫీజులపై వచ్చే నెల మొదటివారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

రాష్ట్ర విభజనతో కోల్పోయిన 350 మెడికల్ సీట్ల కోసం కేంద్రం ద్వారా కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. మరోపక్క రాష్ట్రానికి 450 మెడికల్ సీట్లు వచ్చాయని, వీటిలో తిరుపతిలోని పద్మావతి మెడికల్ కాలేజీలో కేవలం మహిళలకే 150 సీట్లు కేటాయించారని చెప్పారు. మెడికల్ కౌన్సెలింగ్ లో గత ఏడాది విధానాన్నే అవలంభించనున్నామని వెల్లడించారు. మంత్రిగా కామినేని శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement