వీరు కొందరు మాత్రమే. పదుల సంఖ్యలో ఉన్న మేలిరకపు మణిపూసలకు వీరు ప్రతినిధులు. మందులతో పాటు మాటలతోనూ బాధను మాన్పుతున్న మహిళా వైద్యుల నై‘పుణ్యానికి’ చిహ్నాలు వీరు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వైద్యులు పెరిగారు. వైద్య విధానాలు పెరిగాయి. అందుబాటులో ఉన్న మందుల సంఖ్య కూడా బాగా పెరిగింది. కానీ వైద్యులు, బాధితులకు మధ్య ఉండాల్సిన ఆత్మీయ కోణం మాత్రం రానురాను తగ్గుతోంది. ఈ శూన్యాన్ని భర్తీ చేస్తున్నారు కొందరు అతివలు. వైద్యాన్ని వ్యాపారంలా కాకుండా సేవలా భావిస్తూ, వృత్తిని దైవంగా పూజిస్తూ ‘షి’కిత్స చేస్తున్నారు. మరి ప్రాణం పోయగలిగే శక్తి ఉన్న స్త్రీలకు ప్రాణాలు కాపాడడం పెద్ద పని కాదు కదా.
సేవ చేస్తా..
సమాజంలో పేదలకు సేవ చేయాలని చిన్నప్పటి నుంచి ఉంది. ఆ ఆలోచనతోనే ఎంబీబీఎస్ పూర్తి చేశా ను. ఇప్పుడు చాపర పీహెచ్‌సీ వైద్యాధికారిగా పోస్టింగ్ లభించింది. ఇప్పుడు ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందించే అవకాశం కలిగింది. వైద్య సేవలు అందించడంతో పా టు ఆరోగ్య పరమైన విజ్ఞానాన్ని అంది స్తున్నా. పీహెచ్‌సీకి వివిధ వ్యాధులతో పాటు గైనిక్ సమస్యలతో పేద మహిళలు వస్తున్నా రు. వారికి నా వంతు సాయపడుతున్నాను.
–దువ్వాడ దివ్య, చాపర పీహెచ్‌సీ వైద్యురాలు
తాత కోరిక
నేను డాక్టర్ కా వాలనేది మా తాతయ్య ఆశ యం. ఈ వృత్తి అంటే నాకెం తో ఇష్టం. గ్రా మీణ ప్రజలకు సేవలు చేయాలనే ఆశయంతోనే సంతకవిటి పీహెచ్‌సీలో చేరాను. లక్ష్యం, పట్టుదల ఉంటే మహిళలు ఏదైనా సాధించవచ్చు. అందుకు కు టుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా కావాలి.
–గట్టి భార్గవి, సంతకవిటి పీహెచ్‌సీ వైద్యాధికారి
కాబోయే అమ్మకు ఆసరాగా..
ఇచ్ఛాపురం: డాక్టర్ పిరియా ప్రతిభాప్రియ.. ఇచ్ఛాపురం చుట్టపక్కల ప్ర సూతి కేసులకు కేరాఫ్. వైద్యుల పేర్లు జనం గుర్తు పెట్టుకోవడమే ఆ డాక్టర్‌కు పెద్ద ఘనత. అలాంటిది ప్రతిభాప్రియ వైద్యురాలిగానే కాకుండా ఓ ఆత్మీయురాలిగా స్థానికులకు సేవలందిస్తూ అందని హృదయాల్లో చోటు సంపాదించారు. ఇచ్ఛాపురం పట్టణంలోని మంగళవారంపేటలో నివాసమంటున్న ప్రతిభాప్రియ నామమాత్రమైన ఫీజుతోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ఈమె కాకినాడలో ఎంబీబీఎస్ పూర్తి చేసి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో 2003లో గైనకాలజీలో స్పెషలైజేషన్ చేశారు. సోంపేట, ఇచ్ఛాపురం, హరిపురం, ఎంఎస్‌పల్లి, కవిటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించి ఆయా ప్రాంతాల్లో ప్రజల ఆదరణ చూరగొన్నారు. ముఖ్యంగా ప్రసూతి కేసులను సున్నితంగా, సమర్థంగా పరిష్కరించి మంచి పేరు సంపాదించారు. స్థానిక మహిళలు రక్తహీనతతో బాధ పడుతున్నారని, పౌష్టికాహారం సమృద్ధిగా తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆమె సూచిస్తున్నారు.
15 మందిలో ఒకరు..
సోంపేట: ప్లాస్టిక్ సర్జరీ.. సినిమాల్లో తప్ప సిక్కోలు వాసులు స్థానికంగా ఈ పేరు వినే అవకాశం చాలా తక్కువ. అలాంటిది మన ఆడ పడు చు ప్లాస్టిక్ సర్జరీ నిపుణురాలిగా రాణిస్తుండడం మనకు గర్వకారణమే కదా. బారువ గ్రామానికి చెందిన బస్వా మణికుమారి ఉమ్మడి రాష్ట్రానికి చెందిన క్యాన్సర్ ప్రభుత్వ వైద్యశాలలో (హైదరాబాద్) ప్లాస్టిక్ సర్జ రీ నిపుణులుగా రాణిస్తున్నారు. మణికుమారి బారువ గ్రామంలోని ప్ర భుత్వ పాఠశాలల్లో ప్రాథమిక, ఉన్నత విద్యను అభ్యసించారు. ఇంటర్ ను శ్రీకాకుళం ప్రభుత్వ కళాశాల, ఎంబీబీఎస్‌ను విశాఖ పట్టణంలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో చదివారు. ఉన్నత స్థానంలో ఉండడమే కాదు అంతే ఉన్నతంగా ఆలోచిస్తూ ఏటా వేలాది మందికి గ్రహణం మొర్రి, క్యాన్సర్ సంబంధిత శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ సర్జరీ స్త్రీ వైద్య నిపుణులు కేవలం 15 మంది వరకే ఉంటారు. అందులో మణికుమారి ఒకరు. ఈ ప్రాంతం నుంచి వెళ్లే రోగుల అవసరాలు తీర్చడంలోనూ ఆమె ముందుంటారు.
మార్గదర్శకురాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అవ్వారు కృష్ణవేణి.. అచ్చమైన తెలుగు పేరు. నిబద్ధతకు మారుపేరు. రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్పత్రి ముఖ చిత్రం మెల్లగా మారుతోంది. తనదైన ముద్రను ఆమె స్పష్టం చేయడంతో ఒక్కొక్కటిగా మార్పులు మొదలవుతున్నాయి. ఆమె పుట్టి పెరిగినదంతా వైజాగ్‌లోనే అయినా ఉద్యోగ రీత్యా ఇప్పుడు సిక్కోలుతో మంచి సంబంధం ఏర్పరచుకున్నారు. ఆమె సాధించిన ఘనతల్లో కొన్ని పరిశీలిస్తే..
వైద్యాధికారిగా తొలి పోస్టింగ్ విశాఖ జిల్లాలోని అనకాపల్లి దగ్గర హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వచ్చింది. ఆమె చేరిన కొత్తల్లోనే ఆ గ్రామంలో కలుషిత నీటి వల్ల ప్రజలం దరికీ డయేరియా వచ్చేసింది. ఆ సమయంలో బాలింతరాలైనప్పటికీ, ఆ గ్రామంలోనే ఉండిపో యి, టీమ్ వర్క్‌తో ప్రజలందరికీ వైద్యం అంది ంచారు. ఇది ఆమె కెరీర్‌లో ఇదే తొలి విజయం.
ఏడేళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన ఆమె ఆ తర్వాత సేవామార్గం వైపు మళ్లారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ఆమె చేసిన వైద్య పరి శోధనకు 2000 సంవత్సరంలో ప్యారేలాల్ శర్మ మెమోరియల్ ప్రైజ్ వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఈమె.
రిమ్స్‌లో డిపార్ట్‌మెంట్ అభివృద్ధి
కృష్ణవేణి ఆంధ్రామెడికల్ కాలేజీ (ఏఎంసీ)లో పనిచేస్తూ, బదిలీపై 2014లో శ్రీకాకుళం రిమ్స్ వైస్ ప్రిన్సిపాల్‌గా వచ్చారు. తర్వాత డీన్, 2017 జూలైలో డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. డైరెక్టర్ కాకముందే తన విభాగాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2016 ఆగస్టులో 1981 ఆంధ్రా మెడికల్ కళాశాల ఎంబీ బీఎస్ బ్యాచ్ స్నేహితుల (ప్రస్తుతం అమెరికాలో ఒకరు, కాకినాడలో ఒకరు, పలాసలో ఒకరు ఉన్నారు మిగిలిన వారు వేరువేరు ప్రాంతాల్లో ఉన్నారు.) విరాళాలు కలిపి సుమారు నాలుగున్నర లక్షల రూపాయలతో కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్‌మెంట్‌లో ఆరు ఏసీలు, ఇన్నోవేషన్, సౌకర్యాలు కల్పించారు.
గ్రంథాలయం తాగునీటి కోసం ఫ్యూరిఫైర్ మెషీన్, సెమినార్ హాల్‌లో ఎల్‌సీడీ, ఏసీ సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే అన్ని తరగతి గదులకు ఎల్‌సీడీ ప్రొజెక్టర్లు, ఇన్వెర్టర్లు ఏర్పాటు చేశారు.
ఠిడైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాక మరింత శ్రద్ధ పెట్టారు. స్టాఫ్ రూమ్‌లో ఏసీలు, ఇన్వెర్టర్లు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేయించారు.
ఠిమెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్‌ను ప్రారంభించి, వైద్యులకు బేసిక్ ట్రైనింగ్ నాలుగు రో జుల పాటు రిమ్స్‌లో అందజేశారు. ఇలాంటి శిక్షణ ఏపీలోనే తొలిసారి కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment