- జిల్లా చెకుముకి సై¯Œ్స సంబరాల్లో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి
Published Sun, Dec 18 2016 11:42 PM | Last Updated on Sat, Sep 15 2018 7:30 PM
కొత్తపేట :
విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే శాస్రీ్తయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సూచించారు. జిల్లా స్థాయి చెకుముకి సై¯Œ్స సంబరాలు–2016 (సై¯Œ్స ప్రతిభా పరీక్ష) జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తపేట కాంతిభారతి హైస్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. జేవీవీ మండల శాఖ అధ్యక్షుడు బండారు శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి ఆదివారపుపేట వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు తోట వెంకటేశ్వరరావు–కాంతిభారతి విద్యా సంస్థల కరస్పాండెంట్ టి సత్యవాణి పర్యవేక్షణలో జేవీవీ జిల్లా అధ్యక్షుడు కేఎంఎంఆర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉదయం జాతీయ పతాకాన్ని ఎమ్మెల్సీ ఆర్‌ఎస్, జేవీవీ పతాకాన్ని ఆ సంస్థ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సీహెచ్ స్టాలి¯ŒS ఆవిష్కరించారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ చెకుముకి సై¯Œ్స ప్రతిభా పరీక్షలు భవిష్యత్‌లో గ్రామీణ విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ముందుకు వచ్చిన కాంతిభారతి యాజమాన్యాన్ని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అభినందించారు. ఎమ్మెల్సీ ఆర్‌ఎస్ మాట్లాడుతూ ఈ దేశభవిష్యత్తు గురువులు, విద్యార్థులపైనే ఆధారపడి ఉందన్నారు. అనాగరికత నుంచి నాగరికతలోకి, చీకటి నుంచి వెలుగులోకి వచ్చామంటే దాని వెనుక సై¯Œ్స హస్తం ఉందన్నారు. ఎందరో శాస్త్రవేత్తల మేధస్సుతో సై¯Œ్స తద్వారా దేశం ఎంతగానో అభివృద్ధి చెందాయన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు దర్నాల రామకృష్ణ, రాష్ట్ర వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జేవీవీ జిల్లా గౌరవాధ్యక్షుడు ఈఆర్ సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి ఎండీ ఖాజామొహిద్దీన్, కళాసాహితి అధ్యక్షుడు పెన్మెత్స హరిహరదేవళరాజు, ఎంఈఓ వై. సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.అనంతరం విద్యార్థులకు పరీక్షలు, క్విజ్ పోటీలు నిర్వహించారు.
Advertisement