గజ్వేల్‌రూరల్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంత విద్యార్థుల నైపుణ్యం ప్రదర్శించేందుకు సైన్స్‌ఫెయిర్లు వేదిక కావాలని రిటైర్ట్ పరిశ్రమల శాఖ డిప్యూటీ డెరైక్టర్ అధికారి మాణయ్య అన్నారు. గురువారం గజ్వేల్ మండలం రిమ్మనగూడ ప్రొకడెన్స్ ఫార్మసీ కళాశాలలో సైన్స్ ఫెయిర్, యువశాస్త్రవేత టాలెంట్ అవార్డు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు ఇలాంటి వేదికలు ఎంతగానే తోడ్పడతాయన్నారు. విద్యార్ధులు ఉపాధ్యాయులు చెప్పిన విషయలను అర్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్ధికి ఏదో ఓ రంగంపై ఆసక్తి ఉంటుందని దాని గుర్తించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని కోరారు. విద్యార్ధుల తల్లిదండ్రులు వారిలోని ప్రతిభను గుర్తించాలన్నారు. ప్రతి విషయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పిన విషయలను ఆకళింపు చేసుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు శాస్త్రవేత్తలుగా గుర్తింపు పొందాలంటే సైన్స్‌ఫెయిర్ ఓ వేదికగా ఉపయోగపడుతుందన్నారు. మేనేజింగ్ కమిటీ చైర్మన్ హరిత మాట్లాడతూ ప్రొకడెన్స్ కళాశాలలో ప్రతి ఏడాది సైన్స్‌ఫెయిర్ నిర్వహిస్తామన్నారు. కళాశాల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా నుంచి వందల సంఖ్యలో విద్యార్ధులు పాల్గొంటారన్నారు. మరో రెండు రోజుల పాటు సైన్స్‌ఫెయిర్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో డెరైక్టర్ జయంతి, ప్రిన్సిపాల్ జస్వంత్, ఎస్‌ఓ నరేష్‌రెడ్డి, ఎంఓ రాయప్పరెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
Published Thu, Dec 12 2013 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement