సైన్స్‌ఫెయిర్ లో పేలుడు | 10 childrean injured in blast | Sakshi
Sakshi News home page

సైన్స్‌ఫెయిర్ లో పేలుడు

Published Mon, Feb 29 2016 1:21 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

10 childrean injured in blast

ప్రొద్దుటూరు: వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.  సైన్స్‌ ఫెయిర్‌ లో ఏర్పాటు చేసిన పెట్రోల్ పరికరాన్ని చూస్తున్న సమయంలో అది అకస్మాత్తుగా పేలింది. దీంతో 10 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని ప్రొద్దుటూరు ఆంధ్రకేసరిరోడ్డులో సోమవారం చోటు చేసుకుంది.
 
స్థానిక శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు సైన్స్‌ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అదే పాఠశాలకు చెందిన ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు ప్రదర్శనను తిలకిస్తున్న సమయంలో పెట్రోల్‌తో తయారు చేసిన ఓ పరికరం పేలింది. దీంతో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement