చిట్టి బుర్రలు.. గొప్ప ఆవిష్కరణలు
Published Fri, Sep 16 2016 8:29 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
- ఆకట్టుకున్న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్
- అద్భుత సైన్స్ ప్రాజెక్టులతో విద్యార్థులు అదుర్స్
జంగారెడ్డిగూడెం : ‘భవిష్యత్తులో సాధించబోయే విజయాలకు సజనాత్మకత అనేది తాళం చెవిలాంటిది.. ప్రాథమిక దశలోనే విద్యార్థులలోని సజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికితీయాలి.’ అని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారు. ఆ దిశగా సాగే ప్రయత్నాల్లో భాగంగానే విద్యాశాఖ విద్యార్థుల్లో సజనను వెలికితీసేందుకు ఏటా సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తోంది. సైన్స్‌లో వినూత్నమైన ప్రయోగాలతో విద్యార్థులూ తమలోని సజనాత్మకతను చాటుకుంటున్నారు. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ప్రారంభమైన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో వివిధ రకాల ప్రాజెక్టులతో విద్యార్థులు ఇలా ఆకట్టుకున్నారు.
పవనం.. శక్తిదాయకం
పవనాల ద్వారా చేంజ్ ఆఫ్ ఎనర్జీ నమూనా ప్రదర్శించాడు శనివారపు పేట హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి కె.ప్రవీణ్. పవనాల ద్వారా విండ్ ఎనర్జీని, మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా తయారు అవుతుందో వివరించారు. పవనాల ద్వారా మెకానికల్ ఎనర్జీ సష్టించి భూగర్భ జలాలను వెలికి తీసుకురావచ్చని అలాగే విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని నిరూపించాడు.
– పవనాల ద్వారా చేంజెస్ ఆఫ్ ఎనర్జీ ప్రాజెక్టు నమూనా తయారుచేసిన విద్యార్థి ప్రవీణ్, ఉపాధ్యాయుడు
––––––––––––––––––––––
వరద ముప్పునకు ఆటోమేటిక్ చెక్
వరదలు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా డ్యామ్ గేట్లు ఎత్తివేసే ప్రదర్శన ఇది. కె.గోకవరం హైస్కూల్ విద్యార్థిని నిట్టా ఉదయప్రియ ఈ నమూనాను ప్రదర్శించింది. వరదలు సంభవించిన సమయంలో జలాశయం గేట్లు ఎత్తకపోతే కాలువగట్లు, చెరువు గట్లు తెగిపోయే ప్రమాదం ఉన్నందున జలాశయంలోకి నీరు చేరగానే సెన్సార్‌ల ద్వారా ఆటోమేటిక్‌గా జలాశయం గేట్లు ఎత్తుకుంటాయని వివరించింది. తద్వారా వరదముంపును అరికట్టవచ్చని చెబుతోంది.
– వరదల సమయంలో ఆటోమేటిక్‌గా జలాశయం గేట్లు ఎత్తివేసే ప్రదర్శన
––––––––––––––––––––––––––––––––––
చెత్త నుంచి సంపద ఉత్పత్తి
వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసుకోవడం ద్వారా పునర్ వినియోగం ఎలా చేసుకోవాలి, పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనే అంశంపై భీమడోలు డిపాల్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థిని ఎన్.జ్యోత్సS్న ప్రాజెక్టు తయారు చేసింది. వథా నీరు శుద్ధి చేయడం, వివిధ రకాల వస్తువుల వినియోగం తరువాత పడవేయకుండా వస్తువులుగా మలచడాన్ని ప్రయోగాత్మకంగా వివరించింది.
– వథా నీరు, వ్యర్థ పదార్థాలను రీ సైక్లింగ్ చేసే విధానాన్ని వివరిస్తున్న విద్యార్థిని
–––––––––––––––––––––––––
పంటను జంతువు తాకగానే సైరన్‌మోత
అటవీ ప్రాంతంలో గిరిజనులు సాగుచేసే పోడు వ్యవసాయంలో పంటలను ఎలా రక్షించుకోవాలో నమూనాను ప్రదర్శించాడు ఈస్ట్ యడవల్లి హైస్కూల్ విద్యార్థి ఎం.కిశోర్‌బాబు. పంటలను అటవీ ప్రాంతంలోని జంతువులు తాకగానే సెన్సార్ల ద్వారా సైరన్ మోగే విధంగా నమూనాను ప్రదర్శించాడు. సైరన్ నుంచి వచ్చే శబ్దం కారణంగా జంతువులు పారిపోతాయని, తద్వారా పంటను రక్షించుకోవచ్చని వివరించాడు.
– పోడు వ్యవసాయాన్ని రక్షించుకునే వి«ధానం తెలిపే నమూనాతో విద్యార్థి
––––––––––––––––––––––––––––
మా ఊరు.. సమస్యల సుడిగుండం
తమ గ్రామ సమస్యలను గ్రామ నమూనా తయారుచేసి కళ్లకు కట్టేలా ప్రదర్శించాడు పెదపాడు మండలం వడ్డిగూడెం ఎంపీయూపీ స్కూల్ విద్యార్థి ఎం.సుధీర్. తమ గ్రామంలో చేపల పెంపకం సానుకూల అంశం అని, అయితే అపరిశుభ్రత, డ్రైన్లు, రవాణా సౌకర్యం లేక అభివద్ధికి నోచుకోవడం లేదని వివరించాడు. సౌకర్యాలు కల్పించాలని నమూనాలో ప్రదర్శించాడు.
– మా ఊరు సమస్యల సుడిగుండం అంటూ గ్రామ నమూనా ప్రదర్శిస్తున్న వడ్డిగూడెం విద్యార్థులు
ఇంజిన్‌ఆయిల్ ద్వారా విద్యుదుత్పత్తి
వాహనాల్లో వినియోగించి, తొలగించే ఇంజన్ ఆయిల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని నిరూపించాడు కామవరపుకోట హైస్కూల్ విద్యార్థి ఎ.వెంకన్న. వ్యర్థ ఇంజిన్ ఆయిల్‌ను బాయిల్ చేయడం ద్వారా ఆవిరి ఉత్పత్తి అవుతుందని, ఆ ఆవిరికి నీటిని సంయోగపరిచి కెమికల్ ఎనర్జీని సష్టించడం ద్వారా విద్యుత్ శక్తిగా మార్చవచ్చని నిరూపించాడు.
– మోటార్‌వాహనాల్లోని తీసివేసిన ఇంజిన్ ఆయిల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి తయారుచేసే ప్రాజెక్టును ప్రదర్శిస్తున్న విద్యార్థి, ఉపాధ్యాయుడు
Advertisement
Advertisement