విద్యార్థులు చక్కని ప్రతిభను కనబరిచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని నగర మేయర్ ఆకుల సుజాత ఆకాంక్షించారు.
నిజామాబాద్ అర్బన్ : విద్యార్థులు చక్కని ప్రతిభను కనబరిచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని నగర మేయర్ ఆకుల సుజాత ఆకాం క్షించారు. గురువారం కంఠేశ్వర్‌లోని ఎంఎస్‌ఆర్ హైస్కూల్‌లో జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్ ప్రదర్శన ప్రారంభించారు. ఆమె ముఖ్యఅతిథి హా జరై మాట్లాడారు. విద్యార్థులు విద్యాబోధనతో పాటు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ స్వార్ధం లేనివాడే సైం టిస్టు అవుతాడని అన్నారు.
దేశానికి ఎందో అందించాలని ఉన్నా, వనరులను ఉపయోగించుకొని కొత్త విధానంను కనుక్కోవాలని సైంటిస్టు పాటుపడతాడని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, దానికి అనుగుణంగా విద్యాబోధన చేయాలన్నారు. తల్లిదండ్రుల తరువాత గురువే ప్రధానమైన వ్యక్తి అని అన్నారు. జిల్లా వ్యవసాయ ప్రాంతమని, ఈ రంగంలో విద్యార్థులు కొత్త ఒరవడి, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలని సూచించారు.
విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం
ఇన్‌సై్పర్ ప్రదర్శన జిల్లా విద్యార్థులకు ఎంతో దోహదపడుతుందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వెంకటేశ్వర్‌రావు అన్నారు. వారిలో ఉన్న ప్రతి భను వెలికితీసేందుకు వారిని శాస్త్రవేత్తలు గా తీర్చిదిద్దడానికి మేలు జరుగుతుందన్నారు. ఇది ప్రతి విద్యార్థికి చక్కని అవకాశం అన్నారు. అలాగే ఇతర విద్యార్థులు కూడా ఇలాంటి ప్రదర్శనలను తిలకించాలన్నారు. ఉత్సాహం, ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలి
అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలన్నారు. వి దేశాల నుంచి పెట్రోలియం దిగుమతి చేసుకుం టున్నామని, మనదగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకొని శాస్త్రవేత్తలను ఉపయోగించుకుంటే ఇక్కడే అన్ని లభిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని విద్యార్థులు నూతన పద్ధతులను కనుక్కోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాసచారి, డిప్యూటీ ఈఓలు పో చాద్రి, పద్మనాభం, అసిస్టెంట్ పరీక్షల వి భాగం అధికారి నాగేశ్వరరావు , డీసీఈబీ సెక్రటరీ చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘం నాయకులు కమలాకర్‌రావు, సురేష్, మాడవేటి వినోద్‌కుమార్, దేవిసింగ్ పాల్గొన్నారు.