Sujata akula
-
ఆడపిల్లకు అండగా ఉందాం
ఇందూరు : ఆడపిల్లలపై చిన్న చూపు వద్దని, వారికి అండగా ఉందామని ఇన్చార్జి కలెక్టర్, జడ్పీ సీఈవో రాజారాం, నగర మేయర్ ఆకుల సుజాత పిలుపునిచ్చారు. శనివా రం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద జిల్లా బాలల సంరక్షణ విభాగం (ఐసీపీఎస్) ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లల పై ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందన్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లంటే భారంగా భావిం చడం మానవత్వం అనిపించుకోదన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, చేయ డం నేరమన్నారు. లింగ నిర్ధారణకు ముందుకు వచ్చిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల్లో ఆడ, మగ తేడాను చూపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. సృష్టిలో ఇద్దరూ సమానమేనని భావించాలన్నారు. పెంపకంలో తేడా చూపవద్దని కోరా రు. ఆడపిల్లలకు రక్షణ కల్పించి, చదివించాల్సిన బాధ్య త తల్లిదండ్రులపై ఉందన్నారు. పిల్లలను అక్రమంగా రవాణా చేయడం, చట్ట విరుద్ధంగా దత్తతనివ్వడం, అమ్మడం, కొనడం నేరమన్నా రు. వీటిని నిరోధించడానికి ఐసీపీఎస్ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆడపిల్లలపై వివక్షను రూపుమాపేందుకోసం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాను అంగన్వాడీ సిబ్బంది, విద్య, వైద్య, పోలీసు శాఖల సిబ్బంది విజయవంతం చేయాలని కోరారు. జడ్పీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ రైల్వేకమాన్, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్లకార్డులు చేతబడ్డి నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ రాములు, హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య, ఐసీపీఎస్ సిబ్బంది చైతన్య, ముఖీం తదితరులు పాల్గొన్నారు. -
మేయర్‌కు బుగ్గ కారేదీ!
- గన్మన్లూ లేరు - సొంత వాహనంలోనే పర్యటనలు నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగర ప్రథమ పౌరురాలికి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. క్యాబినెట్ మినిస్టర్ హోదాతో దర్జాగా బుగ్గ కారులో తిరగాల్సిన ఆమె.. సొంత వాహనంలోనే నగర పర్యటనలు చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించి మూడు నెలలవుతున్నా.. గన్మన్ల జాడ కూడా లేదు. ఆకుల సుజాత నగర ప్రథమ పౌరురాలిగా జూన్ 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం ఆమెకు బుగ్గకారును, ఇద్దరు గన్మన్లకు కేటాయించాల్సి ఉంటుంది. కానీ బాధ్యతలు స్వీకరించి మూడు నెలలవుతున్నా ఈ సౌకర్యాలేవీ ఆమెకు అందలేదు. సొంత పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కారణంగానే మేయర్‌కు ఈ సౌకర్యాలు దక్కడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ‘నా వల్లే నీకు మేయర్ పదవి దక్కింది. నేను చెప్పినట్లు నడుచుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పుడే బుగ్గ కారు ఉపయోగించాలి. మిగిలిన సమయాల్లో సాదాసీదాగా ఉండాలి’ అని సదరు నేత సూచించినట్లు సమాచారం. ఆ నాయకుడు చెప్పినట్లే నడుచుకోవాల్సి వస్తోందని కార్పొరేషన్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి పేర్కొన్నారు. ప్రస్తుతం ఏ కార్యక్రమానికైనా మేయర్ సొంత వాహనంలోనే వెళ్తున్నారు. ఎలాంటి సమావేశాలకైనా తన అనుమతి తీసుకునే హాజరు కావాలని ఆ ప్రజాప్రతినిధి హుకూం జారీ చేసినట్లు సమాచారం. కార్పొరేషన్‌ను శాసిస్తున్న సదరు నేతపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేయర్‌కు సంబంధం లేకుండానే వీక్లీ మార్కెట్లోని ఓ అపార్ట్‌మెంట్‌కు కార్పొరేషన్ అనుమతిని ఇప్పించినట్లు తెలుస్తోంది. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
నిజామాబాద్ అర్బన్ : విద్యార్థులు చక్కని ప్రతిభను కనబరిచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని నగర మేయర్ ఆకుల సుజాత ఆకాం క్షించారు. గురువారం కంఠేశ్వర్‌లోని ఎంఎస్ఆర్ హైస్కూల్లో జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్ ప్రదర్శన ప్రారంభించారు. ఆమె ముఖ్యఅతిథి హా జరై మాట్లాడారు. విద్యార్థులు విద్యాబోధనతో పాటు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ స్వార్ధం లేనివాడే సైం టిస్టు అవుతాడని అన్నారు. దేశానికి ఎందో అందించాలని ఉన్నా, వనరులను ఉపయోగించుకొని కొత్త విధానంను కనుక్కోవాలని సైంటిస్టు పాటుపడతాడని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, దానికి అనుగుణంగా విద్యాబోధన చేయాలన్నారు. తల్లిదండ్రుల తరువాత గురువే ప్రధానమైన వ్యక్తి అని అన్నారు. జిల్లా వ్యవసాయ ప్రాంతమని, ఈ రంగంలో విద్యార్థులు కొత్త ఒరవడి, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలని సూచించారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం ఇన్‌సై్పర్ ప్రదర్శన జిల్లా విద్యార్థులకు ఎంతో దోహదపడుతుందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వర్రావు అన్నారు. వారిలో ఉన్న ప్రతి భను వెలికితీసేందుకు వారిని శాస్త్రవేత్తలు గా తీర్చిదిద్దడానికి మేలు జరుగుతుందన్నారు. ఇది ప్రతి విద్యార్థికి చక్కని అవకాశం అన్నారు. అలాగే ఇతర విద్యార్థులు కూడా ఇలాంటి ప్రదర్శనలను తిలకించాలన్నారు. ఉత్సాహం, ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలి అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలన్నారు. వి దేశాల నుంచి పెట్రోలియం దిగుమతి చేసుకుం టున్నామని, మనదగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకొని శాస్త్రవేత్తలను ఉపయోగించుకుంటే ఇక్కడే అన్ని లభిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని విద్యార్థులు నూతన పద్ధతులను కనుక్కోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాసచారి, డిప్యూటీ ఈఓలు పో చాద్రి, పద్మనాభం, అసిస్టెంట్ పరీక్షల వి భాగం అధికారి నాగేశ్వరరావు , డీసీఈబీ సెక్రటరీ చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘం నాయకులు కమలాకర్‌రావు, సురేష్, మాడవేటి వినోద్‌కుమార్, దేవిసింగ్ పాల్గొన్నారు.