ఇందూరు : ఆడపిల్లలపై చిన్న చూపు వద్దని, వారికి అండగా ఉందామని ఇన్‌చార్జి కలెక్టర్, జడ్పీ సీఈవో రాజారాం, నగర మేయర్ ఆకుల సుజాత పిలుపునిచ్చారు. శనివా రం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద జిల్లా బాలల సంరక్షణ విభాగం (ఐసీపీఎస్) ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లల పై ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందన్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లంటే భారంగా భావిం చడం మానవత్వం అనిపించుకోదన్నారు.
లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, చేయ డం నేరమన్నారు. లింగ నిర్ధారణకు ముందుకు వచ్చిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పిల్లల్లో ఆడ, మగ తేడాను చూపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. సృష్టిలో ఇద్దరూ సమానమేనని భావించాలన్నారు. పెంపకంలో తేడా చూపవద్దని కోరా రు. ఆడపిల్లలకు రక్షణ కల్పించి, చదివించాల్సిన బాధ్య త తల్లిదండ్రులపై ఉందన్నారు.
పిల్లలను అక్రమంగా రవాణా చేయడం, చట్ట విరుద్ధంగా దత్తతనివ్వడం, అమ్మడం, కొనడం నేరమన్నా రు. వీటిని నిరోధించడానికి ఐసీపీఎస్ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆడపిల్లలపై వివక్షను రూపుమాపేందుకోసం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాను అంగన్‌వాడీ సిబ్బంది, విద్య, వైద్య, పోలీసు శాఖల సిబ్బంది విజయవంతం చేయాలని కోరారు.
జడ్పీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ రైల్వేకమాన్, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్లకార్డులు చేతబడ్డి నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ రాములు, హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య, ఐసీపీఎస్ సిబ్బంది చైతన్య, ముఖీం తదితరులు పాల్గొన్నారు.
ఆడపిల్లకు అండగా ఉందాం
Published Sun, Sep 21 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM
Advertisement