Arikela narsareddy
-
కారెక్కిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. త్వరలోనే తన అనుచరులు, క్యాడర్‌ను పార్టీలో చేర్పించేందుకు స్థానికంగా భారీ ఎత్తున ఓ సమావేశాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా నర్సారెడ్డి తెలిపారు. అరికెల నర్సారెడ్డి చేరిక పట్ల హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్, ఆయనకు పార్టీ సముచిత గౌరవం కల్పిస్తుందన్నారు. -
టీడీపీని ఖాళీ చేయించడం ఎవరి వల్ల కాదు
కమ్మర్పల్లి: తెలంగాణలో టీడీపీని ఖాళీ చేయిస్తామని సీఎం కేసీఆర్ అంటున్నారని, అది ఎవరి వల్ల సాధ్యం కాదని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి అన్నారు. తమ పార్టీ టాటా కంపెనీ లాంటిదని దాన్ని ఎవరు ఏమి చేయలేరన్నారు. సోమవారం మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తల కు గుర్తింపు కార్డులను నర్సారెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తోందన్నారు. రైతాంగానికి ఏడు గంట ల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని, ప్రతి రైతుకు రుణమాఫీ, ప్రతి నిరుపేద కుటుంబానికి పింఛన్ అందిస్తామని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం వీటిని విస్మరించారన్నారు. ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోతే మెడలు వంచి పని చేయిస్తామన్నారు. రుణమాఫీ పథకం కింద బ్యాంకుల్లో 25 శాతం మాత్రమే రుణం ఇస్తున్నార ని, కానీ నూరు శాతానికి రైతులతో సంతకం తీసుకుంటున్నారని ఆరోపించారు. బ్యాంకర్లు, ప్రభుత్వం ఒక్కటై రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు ఎంత మొత్తం తీసుకుంటే అంతే మొత్తానికి సంతకం తీసుకోవాలని ఆయన డిమాం డ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రం లో చెరువులు కుంటలను అభివృద్ధి చేస్తామని సీఎం ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఇదివరకు పరి పాలించిన ప్రభుత్వాలు చెరువులు, కుంటలను కా పాడకపోతే ఇపుడు అవి ఉండేవా అని ప్రశ్నించా రు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి జనవరి ఒకటి నుంచి బీమా వర్తిస్తుందని తెలిపారు. సభ్యత్వం తీసుకోవడానికి మంగళవారం ఆఖరి రోజన్నారు. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
నిజామాబాద్ అర్బన్ : విద్యార్థులు చక్కని ప్రతిభను కనబరిచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని నగర మేయర్ ఆకుల సుజాత ఆకాం క్షించారు. గురువారం కంఠేశ్వర్‌లోని ఎంఎస్ఆర్ హైస్కూల్లో జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్ ప్రదర్శన ప్రారంభించారు. ఆమె ముఖ్యఅతిథి హా జరై మాట్లాడారు. విద్యార్థులు విద్యాబోధనతో పాటు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ స్వార్ధం లేనివాడే సైం టిస్టు అవుతాడని అన్నారు. దేశానికి ఎందో అందించాలని ఉన్నా, వనరులను ఉపయోగించుకొని కొత్త విధానంను కనుక్కోవాలని సైంటిస్టు పాటుపడతాడని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, దానికి అనుగుణంగా విద్యాబోధన చేయాలన్నారు. తల్లిదండ్రుల తరువాత గురువే ప్రధానమైన వ్యక్తి అని అన్నారు. జిల్లా వ్యవసాయ ప్రాంతమని, ఈ రంగంలో విద్యార్థులు కొత్త ఒరవడి, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలని సూచించారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం ఇన్‌సై్పర్ ప్రదర్శన జిల్లా విద్యార్థులకు ఎంతో దోహదపడుతుందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వర్రావు అన్నారు. వారిలో ఉన్న ప్రతి భను వెలికితీసేందుకు వారిని శాస్త్రవేత్తలు గా తీర్చిదిద్దడానికి మేలు జరుగుతుందన్నారు. ఇది ప్రతి విద్యార్థికి చక్కని అవకాశం అన్నారు. అలాగే ఇతర విద్యార్థులు కూడా ఇలాంటి ప్రదర్శనలను తిలకించాలన్నారు. ఉత్సాహం, ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలి అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలన్నారు. వి దేశాల నుంచి పెట్రోలియం దిగుమతి చేసుకుం టున్నామని, మనదగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకొని శాస్త్రవేత్తలను ఉపయోగించుకుంటే ఇక్కడే అన్ని లభిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని విద్యార్థులు నూతన పద్ధతులను కనుక్కోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాసచారి, డిప్యూటీ ఈఓలు పో చాద్రి, పద్మనాభం, అసిస్టెంట్ పరీక్షల వి భాగం అధికారి నాగేశ్వరరావు , డీసీఈబీ సెక్రటరీ చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘం నాయకులు కమలాకర్‌రావు, సురేష్, మాడవేటి వినోద్‌కుమార్, దేవిసింగ్ పాల్గొన్నారు.