8 నుంచి పాఠశాలల క్రికెట్ పోటీలు
Published Mon, Jul 25 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
హన్మకొండ : పాఠశాలల జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ఆగస్టు 8 నుంచి ప్రారంభమవుతాయని ది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ తాళ్లపల్లి జయపాల్ తెలిపారు. సోమవారం హన్మకొండ స్నేహనగర్‌లోని ఓరుగల్లు జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. ప్రథమ స్థానంలో నిలిచే జట్టుకు రూ.10 వేల నగదు పారితోషికాన్ని అందజేస్తామన్నారు. మ్యాచ్‌లు మ్యాట్‌పై జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే పాఠశాలల జట్లు హన్మకొండ స్నేహనగర్‌లోని ఓరుగల్లు జూనియర్ కాలేజీలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. సెమీస్‌కు చేరే నాలుగు జట్లను హైదరాబాద్‌లో జరుగనున్న క్రికెట్ పోటీల్లో ఇతర జిల్లాల జట్లతో ఆడించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ తమ స్కూల్ డ్రెస్‌లతో మ్యాచ్‌లలో ఆడాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 97006 85123, 98666 08130, 98494 40721 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement